Munnar to Alleppey Road Trip Guide : కేరళ (God's Own Country). బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్‌కోసం చూసేవాళ్లు, ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకునేవారి లిస్ట్‌లో ఇది టాప్‌లో ఉంటుంది. అక్కడి అందాలు మనసును కట్టిపడేస్తాయి. మీరు కేరళకి ట్రిప్‌కి వెళ్లాలనుకుంటే కచ్చితంగా మీరు మున్నార్ టూ అలెప్పీ రోడ్ ట్రిప్‌ని ట్రై చేయాల్సిందే. ముఖ్యంగా పార్టనర్‌తో కలిసి మంచి రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునేవారు దీనిని అస్సలు మిస్ కాకూడదంటున్నారు.
మున్నార్ నుంచి అలెప్పీకి రోడ్ ట్రిప్ వెళ్తే.. మీరు ప్రకృతి అందాలను, మంచి ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ ట్రిప్ బెస్ట్. మరి ఈ ట్రిప్‌కి ఎలా వెళ్లాలి? ఎంత దూరం ఉంటుంది? రూట్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దూరమెంత అంటే..
మున్నార్ నుంచి అలెప్పీకి 180 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ట్రాఫిక్ లేకుంటే మీరు 5 నుంచి 6 గంటలు జర్నీ చేసి అలెప్పీకి చేరుకోవచ్చు.
రూట్ ఇదే..
మున్నార్ నుంచి అలెప్పీకి రోడ్ ట్రిప్‌కి వెళ్లాలంటే మున్నార్ నుంచి అడిమలి(Adimaly) వెళ్లాలి. అక్కడి నుంచి కొత్తమంగళం (Kothamangalam).. అటు నుంచి కొచ్చి(Kochi) అనంతరం అలెప్పీ చేరుకుంటారు.
ఈ రోడ్ ట్రిప్‌లో చూడాల్సిన ప్రదేశాలివే..
రోడ్ ట్రిప్‌కి వెళ్లేప్పుడు మీరు ప్రకృతి ప్రసాదించిన ఎన్నో అందాలు చూడొచ్చు. మున్నార్‌లో మీరు టీ ప్లాంటేషన్స్ని, మట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్స్ చూడొచ్చు. అడిమలిలో మీరు వాటర్ ఫాల్స్ చూడొచ్చు. కాసేపు టైమ్ తీసుకుని మీరు ఈ వ్యూని, వాటర్ పాయింట్‌ని ఎంజాయ్ చేయవచ్చు. కొత్తమంగళంలో మార్తోమా చర్చ్, లోకల్ మార్కెట్‌ను ఎక్స్ప్లోర్ చేయవచ్చు. కొచ్చిలో ఫోర్ట్, మట్టన్‌చెర్రీ ప్యాలేస్ చూడొచ్చు. అక్కడి నుంచి కొచ్చి మెరైన్ డ్రైవ్ చేసి.. అలెప్పీకి వెళ్లాలి. అలెప్పీకి వెళ్తే కచ్చితంగా చూడాల్సిన వాటిలో బ్యాక్ వాటర్స్ ఉంటాయి. అక్కడ బోట్ రైడ్ తీసుకుని.. అలెప్పీ బీచ్‌కి వెళ్లొచ్చు.
తెలుసుకోవాల్సినవి ఇవే..
మీరు రోడ్ ట్రిప్‌కోసం మున్నార్ నుంచి అలెప్పీకి వెళ్లాలనుకుంటే.. రోడ్ కండీషన్స్, వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలి. సాధారణంగా టూరిస్ట్ ప్లేస్‌లు కాబట్టి అక్కడ రోడ్స్ బాగానే ఉంటాయి. కొన్ని చోట్ల గుంతలు, రఫ్ రోడ్స్ ఉండొచ్చు. డ్రైవ్‌కి వెళ్లినప్పుడు కాస్త అలెర్ట్‌గా ఉండాలి. అలాగే రోడ్ వైండిగ్స్ పట్ల అవగాహన కలిగి ఉండడం లేదంటే జాగ్రత్తగా వెళ్తే మంచిది. మున్నార్ నుంచి కొచ్చికి వెళ్లేప్పుడు కాస్త ట్రాఫిక్ ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని వెళ్లాలి.
స్టేయింగ్ కోసం..
మున్నార్, అలెప్పీల్లో మీరు స్టేయింగ్ చేయవచ్చు. చాలా ఆప్షన్స్.. తక్కువ బడ్జెట్లోనే అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ నుంచి రిసార్ట్స్ ఉంటాయి. కేరళ లోకల్ ఫుడ్‌ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. కాఫీ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాలు పడే సమయంలో ఈ ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకుంటే మంచిది. అలాగే మీరు వెళ్లేప్పుడు కంఫర్టబుల్‌గా ఉండేందుకు కావాల్సిన వస్తువులు ప్యాక్ చేసుకోవాలి. సన్‌స్క్రీన్, కెమెరా వంటివాటిని తీసుకువెళ్లడం మరచిపోవద్దు. మీరు బయలుదేరే ముందు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్తే ఇబ్బందులు ఉండవు. హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ మీ సొంతమవుతుంది.
Also Read : లాంగ్ డ్రైవ్‌కి వెళ్తున్నారా? అయితే మీకు ఈ స్నాక్స్ బెస్ట్ ఆప్షన్.. ఎందుకంటే