IVF Process for Single Women : ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీనినే IVF అని షార్ట్ ఫామ్‌లో పిలుస్తారు. పిల్లల్ని ప్లాన్ చేసుకునేవారికి ఈ ప్రాసెస్ గురించి కచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే వంధ్యత్వంతో ఇబ్బంది పడే జంటలకు పిల్లల్ని పొందే సౌలభ్యం IVF ద్వారా అందుతుంది. అయితే ఇప్పుడు ఇండియాలో కూడా ఒంటరి మహిళలు కూడా ఈ ట్రీట్మెంట్ ద్వారా సంతాన్నాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భాగస్వామి లేకుండా ఫ్యామిలీని ప్రారంభించుకోవాలనుకునే మహిళలు IVF ద్వారా పిల్లల్ని పొందేందుకు చట్టపరమైన అనుమతులు లభించాయి. వైద్య సాంకేతికతతో పాటు.. మారుతున్న సామాజిక నిబంధనలకు అనుగుణంగా.. ఒంటరి మహిళలు కూడా మాతృత్వాన్ని అనుభవించవచ్చు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ART (రెగ్యూలేషన్) యాక్ట్ 2021 ద్వారా IVF అనుభవించే వెసులు బాటు కల్పించింది. అయితే దీనికి కొన్ని అర్హత, ప్రమాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..
అర్హతలివే..
ఇండియాలో ఒంటరి మహిళగా ఉంటూ IVF ద్వారా పిల్లల్ని పొందాలనుకుంటే.. కొన్ని అర్హతలుండాలి. వయసు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆరోగ్యపరంగా హెల్త్ ఇష్యూలు ఏమి ఉన్నాయో చెక్ చేస్తారు. మీ ప్రెగ్నెన్సీ జర్నీకి మీరు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. దానికి సంబంధించిన సమ్మతి ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ తీసుకోవాలి. అనంతరం IVF చికిత్సకు అనుమతి లభిస్తుంది.
IVF ప్రక్రియ ఎలా ఉంటుందంటే..
ఒంటరి మహిళలకు చేసే IVF ట్రీట్మెంట్ కూడా జంటలకు చేసే ట్రీట్మెంట్ మాదిరిగానే ఉంటుంది. మహిళ అండాశయం నుంచి గుడ్డు సేకరిస్తారు. దాత ఇచ్చే స్పెర్మ్‌తో దానిని ఫలదీకరణం చేస్తారు. అనంతరం ఆ పిండాన్ని గర్భాశయంలోకి బదిలీ చేస్తారు. ఇలా IVF ద్వారా పిల్లల్ని పొందవచ్చు.
అయితే గర్భాశయంలో పిండాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఈ ప్రెగ్నెన్సీ జర్నీని ముందుకు తీసుకువెళ్లాలి. దానికి సంబంధించిన కౌన్సిలింగ్ని ట్రీట్మెంట్ కంటే ముందే ఇస్తారు. మీరు మరింత సపోర్ట్ కావాలనుకుంటే.. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా తీసుకోవచ్చు. ఇలా సింగిల్‌గా ఉంటూ ప్రెగ్నెన్సీని కొనసాగించుకోవాలనుకున్నప్పుడు ఆర్థికంగా కూడా మీరు స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోవాలి.
దాత స్పెర్మ్, ఎగ్ ఎంపికలివే..
స్పెర్మ్ దాతను సదరు మహిళ ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే దాత స్పెర్మ్ లేదా ఎగ్ అవసరమైతే.. క్లినిక్‌ల నుంచి అనామిక దాతల ద్వారా సేకరించిన అనేక రకాల ఎంపికలు ఉంటాయి. లేదంటే మీరు ఇతర జంటలు దానం చేసిన పిండాలను కూడా స్వీకరించవచ్చు. అంటే ఓ జంటకి కలిగిన పిండాన్ని.. మీ గర్భంలో కూడా ప్రవేశ పెడతారు. ఇలా IVF ద్వారా సింగిల్ పేరెంట్ హుడ్ను ఒంటరి మహిళలు అనుభవించవచ్చు. ఈ ART చట్టం ద్వారా కేవలం ఒంటరి మహిళలే కాకుండా.. LGBTQ+ కమ్యూనిటీకి చెందిన వారు కూడా పిల్లల్ని పొందవచ్చు.
Also Read : ఈ సర్జరీతో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారిగా మారొచ్చట.. లింగమార్పిడితో జరిగే మార్పులు, సైడ్ ఎఫెక్ట్లు ఇవే