కొందరికి తలపై దురద అధికంగా పెడుతుంది. దీనికి మాడు అపరిశుభ్రంగా ఉండడం, చుండ్రు అధికంగా పట్టడం లేదా మాడు అతిగా పొడిగా మారడం వంటి సమస్యల కారణంగా మాడు అతిగా దురద పెడుతుంది. దురద పెట్టినప్పుడల్లా చాలా మంది చేస పని నూనె రాసుకుని దువ్వుకోవడం లేదా తలకు స్నానం చేయడం. ఈ రెండు మంచివే అయినా కొన్ని రకాల దురదలకు ఇవి పరిష్కారాన్ని చూపించలేవు. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే తల దురద తగ్గడమే కాదు, జుట్టు కూడా బలంగా పెరుగుతుంది. 


టీ ట్రీ ఆయిల్ 
టీ ట్రీ ఆయిల్ ఆన్‌లైన్ సైట్లలో విరివిగా దొరుకుతుంది. ధర కూడా అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ఒక సీసా కొనుక్కుని పెట్టుకోవడం మంచిది. దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. అందుకే ఈ నూనెను మాడుకు రాస్తే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు పెరుగుదలను అడ్డుకుంటాయి. అంతేకాదు వెంట్రుకలు కూడా బలంగా పెరుగుతాయి.దీన్ని నేరుగా మాడుపై రాస్తే చికాకుగా అనిపిస్తుంది. అందుకే టీట్రీ ఆయిల్‌లో కాస్త కొబ్బరి నూనె లాంటిది కలిపి రాసుకోవాలి. 


కొబ్బరి నూనె
కొబ్బరి నూనె శిరోజాలకు చాలా మంచిది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేస్తుంది. పొడి చర్మాన్ని తేమవంతంగా మారుస్తుంది. చర్మం పొడి బారకుండా కొబ్బరి నూనె రాస్తే మంచిది. దీనిలో కూడా యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. శిలీంధ్రాలు పెరగడాన్ని ఇది అడ్డుకుంటుంది. కొబ్బరినూనె జుట్టును సిల్కీగా మారుస్తుంది. 


అలోవెరా
కలబంద రసం జుట్టుకు చేసే మేలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది దురద వచ్చే మాడుకు చికిత్స చేయడంలో చాలా సహాయపడుతుంది. మాడుకు కలబంద రసాన్ని రాసి ఒక గంటపాటూ వదిలేయాలి. తరువాత నీళ్లతో వాష్ చేసుకోవాలి. జుట్టు పొడవు పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. 


పెరుగు, గుడ్డు
జుట్టుకు పెరుగు, గుడ్డు రెండూ ఎంతో మంచి చేస్తాయి. ఇవి దురదను తగ్గించడంలో సహాయపడతాయి. పెరుగులో ఉండే ఆమ్ల స్వభావం చుండ్రును తొలగించేందుకు సహకరిస్తుంది. అలాగే గుడ్డులోని సొన మాడుకు పట్టించడం వల్ల హెయిర్ ఫోలికల్స్ బలంగా మారుతాయి. జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది. 


కాబట్టి తలపై దురద ఎక్కువవుతున్నా, చుండ్రు పట్టినా, జుట్టు ఊడుతున్నా కూడా పైన చెప్పిన ఇంటి చిట్కాలు పాటిస్తే మంచిది. 


Also read: పగలు పదే పదే నిద్ర వస్తోందా? అయితే అధిక రక్తపోటు ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి


Also read: కింద ఇచ్చిన చిత్రం మీ రొమాంటిక్ రిలేషన్‌షిప్ గురించి చెప్పేస్తుంది, ట్రై చేయండి
















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.