బర్గర్లు, పిజాలు ఇష్టపడని వారు ఎవరుంటారు? ఇప్పుడు వాటి మీదే భారీ మార్కెట్ నడుస్తోంది. ఎన్నో అంతర్జాతీయ రెస్టారెంట్లు బర్గర్లు, పిజాలతో మనదేశంలోకి అడుగుపెట్టి కోట్లలో సంపాదిస్తున్నాయి. జంక్ ఫుడ్ అని తెలిసినా వాటి రుచికి ఎంతో మంది బానిసలైపోయారు.సాధారణంగా బర్గర్ రూ.60 నుంచి మొదలవుతుంది. కానీ ప్రపంచంలోనే అతి ఖరీదైన బర్గర్ ఉంది. దాన్ని తినాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంత ఖరీదు అది. దాన్ని ప్రస్తుతం ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టారు. మీరు దాన్ని తినాలంటే దాదాపు రూ.19 లక్షలు ఖర్చు పెట్టాలి. అమెరికాకు చెందిన బేస్‌బాల్ టీమ్ ‘అట్లాంటా బ్రేవ్స్’. ఈ టీమ్ ‘వరల్డ్ ఛాంపియన్స్ బర్గర్’పేరుతో ఒక బర్గర్ ను చేసింది. దాన్ని అమ్మకానికి పెట్టింది. ఇప్పుడు అమెరికాలో ఇది బాగా ట్రెండవుతోంది. ధరను పాతికవేల డాలర్లుగా నిర్ణయించారు.
ప్రత్యేకతేంటి?
ఇది నాన్ వెజ్ బర్గర్. జపనీస్ జాతికి చెందిన మగ ఎద్దు మాంసంతో దీన్ని తయారుచేశారు.పైన బంగారంతో తాపడం చేశారు. అందులో ఎడిబుల్ గోల్డ్ (తినే బంగారం) వాడారు. గుడ్లు, పీతలు, చీజ్, టమాటో, లెట్యూస్ వంటి వాటితో తయారుచేశారు. చూడగానే నోరూరేలా ఉంది ఈ బర్గర్. కానీ ధర చూసి ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదు. కేవలం చూసి ఆనందిస్తున్నారు. దీన్ని పాతికవేల డాలర్లు పెట్టి కొని తినాలా? అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.
Also read: మీ కలలో ఎప్పుడైనా ట్రాన్స్‌జెండర్ కనిపించారా? అయితే దానర్ధం ఇదేనట