Breast cancer symptoms: సాధారణంగా ఛాతీలో మంటను వైద్యులు తీవ్రమైన సమస్యగా పరిగణిస్తారు. ఛాతీలో మంట అనగానే చాలామంది తమకు గుండెపోటు వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్య కేవలం గుండె పోటు వల్లే కాదు.. వేరే కారణాలు కూడా ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 


ఛాతీలో మంట.. ఒక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితికి సంకేతం కావచ్చు. కానీ ప్రతీసారి ఛాతీలో మంట ప్రమాదకరం కాదు. ఇది కొన్ని సార్లు నిమిషాల్లో తగ్గిపోతుంది. ఇలాంటి తాత్కాలికమైన మంట సాధారణంగా కొన్ని ఆహారాలు తినడం వల్ల వస్తుంది. అయితే, ఈ మంట తీవ్రంగా ఉన్నట్లయితే.. కింది ఆరోగ్య సమస్యలే కారణం కావచ్చు.


తీవ్రమైన ఛాతీలో మంటకు కారణాలు ఇవే..


క్యాన్సర్:


ప్రేగు క్యాన్సర్ ఛాతీలో మంటకు కారణమయ్యే ప్రమాదం ఉంది. ఒక్కో సారి అన్నవాహికలో అడెనో కార్సినోమా అనే క్యాన్సర్ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. అలాంటి సమయంలో కూడా ఛాతీలో మంట వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు అన్నవాహిక లైనింగ్‌ను ప్రభావితం అవుతుంది. పెర్సిస్టెంట్ పెప్టిక్ ఎసోఫాగిటిస్ అన్నవాహికలో ఇబ్బందులు కలిగిస్తుంది. అప్పుడు ఆహారం కడుపులోకి ప్రవేశించడంలో ఇబ్బంది కలుగుతుంది. అప్పుడే ఛాతీలో ఎపిగాస్ట్రిక్ ప్రాంతంలో నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. 


గుండెపోటు:


గుండెపోటును ఛాతీలో మంటగా ఒక్కోసారి పొరబడవచ్చు. హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. రెండు పరిస్థితులు ఛాతీ నొప్పికి కారణమవుతాయి. గుండె జబ్బు అత్యంత  సాధారణ లక్షణాలు ఒళ్లు బిగుతుగా మారడం, నొప్పి, వేగవంతమైన హృదయ స్పందన, చర్మం బిగించడం, అజీర్ణం, వికారం వంటివి కనిపిస్తాయి. అయితే సాధారణంగా ఛాతి నొప్పికి కడుపులో ఎసిడిటీ కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. కడుపులో ఎసిడిటీ వచ్చినప్పుడు నోరు చేదుగా మారుతుంది. అలాగే  వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో కూడా ఛాతిలో మంటగా ఉంటుంది. దీనికి సాధారణ యాంటాసిడ్ వాడితే సరిపోతుంది. 


హెర్నియా:


కడుపులో కొంత భాగం దిగువ ఛాతీలోకి దూరినప్పుడు ఇది జరుగుతుంది. అలాంటి సమయంలో ఛాతీలో మంట వచ్చే అవకాశం ఉంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఇది చాలా సాధారణం. నొప్పి చాలా తీవ్రంగా ఉంటే ఆపరేషన్ లేదా మందుల ద్వారా పరిష్కరించాల్సి ఉంటుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే, నిరంతర ఛాతీలో మంట అన్నవాహికకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది. ఇది అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.


పెప్టిక్ అల్సర్ వ్యాధి:


జీర్ణాశయంలోని చిన్న ప్రేగు లోపలి ఉపరితలంపై  అల్సర్లు ఏర్పడినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అల్సర్ అనేది ఒక పుండు లాంటిది. దీని వల్ల రక్తస్రావం కావచ్చు. ఈ పరిస్థితి ఉన్నవారిలో తరచుగా ఛాతీలో మంట ఏర్పడుతుంది. అలాగే వికారం, వాంతులు, కడుపులో మంట, రక్తస్రావం కారణంగా మలం రంగు మారడం వంటివి చూడవచ్చు. సాధారణంగా ఈ పరిస్థితిని నయం చేయడంలో వివిధ మందులను సూచిస్తారు, 


ఊపిరితిత్తుల సమస్యలు:


ఒక్కో సారి కడుపులోని యాసిడ్స్ ఊపిరితిత్తులలోకి ప్రవేశించినప్పుడు ఛాతిలో మంట ఏర్పడుతుంది. యాసిడ్ పేరుకుపోవడం వల్ల గొంతు నొప్పి, వాపు ఏర్పడవచ్చు. యాసిడ్ ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తే అది ఆస్తమా, లారింగైటిస్, న్యుమోనియా లేదా శ్వాసలోపం వంటి మరింత తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తుంది. అయితే ఛాతిలో మంట ఏర్పడినప్పుడు తాత్సారం చేయకుండా వైద్య నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.


Also read : Muscle Cramps : పనిచేస్తుంటే కండరాలు పట్టేశాయా? అయితే ఈ రిలీఫ్ టెక్నిక్స్ మీకోసమే..


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.