మీరు రోజూ నైట్ డ్రెస్ లేదా షార్ట్స్ వేసుకుని నిద్రపోతున్నారా? ఇదేం ప్రశ్న అని అనుకుంటున్నారా? అయితే, ఈ విషయం తెలిస్తే.. మీరు భవిష్యత్తులో నగ్నంగా నిద్రపోయే ఛాన్సులున్నాయి. ఎందుకంటే.. తాజా పరిశోధనలో ఓ కీలక విషయం తెలిసింది. అదేమిటంటే.. నగ్నంగా నిద్రపోతే బరువు తగ్గుతారట. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? దానికి తగిన కారణం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. .


నగ్నంగా నిద్ర


యూఎస్ కు చెందిన నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ హెల్త్ వారి పరిశోధనలో నగ్నంగా నిద్రించడం వల్ల మీ శరీరం చల్లగా ఉంటుంది. అందువల్ల జీవక్రియలు వేగవంతం అవుతాయి. ఫలితంగా వేగంగా కాలరీలు ఖర్చవుతాయని తేలింది. కనుక రాత్రి నిద్రకి బర్త్ డే సూట్ ఉపయోగించమని నిపుణుల సలహా. కానీ, అది సాధ్యమేనా?


చల్లారాక తినండి


వేడివేడిగా వండిన పాస్తా, ఆలు తినడం మానెయ్యండి, మీరు తీసుకునే కార్బోహైడ్రేట్లను చల్లారిన తర్వాత తినండి. ఎందుకంటే చల్లారిన కార్బోహైడ్రేట్లు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ తో ఉంటాయి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారపదార్థాలు బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉన్న భావనలో ఉండొచ్చు కూడా. అందువల్ల తరచుగా ఏదైనా తినాలనే ఆలోచన రాదు. అందుకే రేపటికి వాడాలనుకునే కార్బోహైడ్రేట్లను రాత్రి వండి పెట్టేసుకోవడం మంచిదని నిపుణుల సలహా.


మింట్ ఫ్రెష్


తరచుగా తియ్యగా తినాలనే కోరిక కలుగుతుంటే మింట్ గమ్ నమలడం, లేదా బ్రష్ చేసుకోవడం ద్వారా ఈ కోరికకు అడ్డుకట్ట వెయ్యొచ్చని నిపుణులు చెబుతున్నారు. మింట్ స్వీట్ క్రేవింగ్స్ ఆపడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుందట.


తింటూ ఉండాలి


కడుపు మాడ్చుకోవడం వల్ల ఏలాభం ఉండదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ తినడం, లేదా భోజనం మానెయ్యడంతో పెద్ద ఫలితాలు ఉండవనే అంటున్నారు. ఆకలిని పట్టించుకోకుండా చాలా సమయం పాటు ఉంటే ఆకలి వల్ల తినాలనే కోరిక చాలా బలంగా పుడుతుంది. అప్పుడు హై క్యాలరీడ్ ఫూడ్ ఎక్కువ తీసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎక్కువ ఆకలి అయ్యే వరకు ఆగకూడదు. కొద్దిగా ఆకలి వెయ్యగానే ఏదైనా పోషకాహారం తీసుకోవాలి. ఇది బరువు పెరగకుండా ఆపుతుందని అనడం లో సందేహం అక్కర్లేదు.


ఘుమఘుమలకు దూరం


ఆహారం నుంచి వచ్చే కమ్మని వాసన ఆకలిని మరింత పెంచుతుంది. తినాలనే కోరిక చాలా బలంగా కలిగిస్తుంది. కనుక ఘుమఘుమలాడే పరిసరాల నుంచి దూరంగా ఉండడం వల్ల తినాలనే కోరికకు దూరంగా ఉండొచ్చు. అనవసరపు మంచింగ్ ను ఇలా నిరోధించవచ్చని ఒక ఫిట్నెస్ ట్రైనర్ అంటున్నారు.


వెనిలా వాసన


వెనిలా వాసన స్వీట్ తినాలనే కోరికను ఆపుతుందని ఒక అధ్యయనంలో తేలిందట. అందుకే వెనిలా ఐస్ క్రీమ్ వాసన చూడాలని అనుకోవడం కంటే వెనిలా ఫ్లేవర్ కలిగిన రూమ్ ఫ్రెషనర్ వాడుకోండి అని నిపుణులు సలహా ఇస్తున్నారు.


నెమ్మదిగా తినండి


తినేందుకు ఎంత సమయం తీసుకుంటున్నారో ఒకసారి గమనించండి. మీరు తిన్నది సరిపోయిందనే సంకేతం మెదడు మీకు అందించేందుకు మెదడుకు 20 నిమిషాల సమయం పడుతుంది. నెమ్మదిగా తినడం వల్ల మెదడుకు స్పందించేందకు కావాలినంత సమయం ఇచ్చినట్టు ఉంటుంది. నమిలి నెమ్మదిగా తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమై పోషకాలను గ్రహించేందుక దోహదం చేస్తుంది కూడా.


ఎడమ చెయ్యి వాడండి


తినేందుకు స్పూన్ ఎడమ చేతితో పట్టుకోవడం వంటి చిన్న చిన్న చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి. మీకు బాగా అలవాటున్న చేతితో స్పూన్ లేదా ఫోర్క్ ను ఉపయోగించకుండా అలవాటు లేని చేతిని  వాడడం వల్ల మెదడు చురుకుగా పనిచెయ్యదు. ఎక్కువ కలుపుతూ సమయం గడుపుతారు. ఫలితంగా ఎంత తింటున్నామనే దాని మీద దృష్టి నిలిచి ఉంటుందనే చిట్కాను మరో నిపుణుడు చెబుతున్నారు.


పోషకాల లోపం


శరీరం రకరకాల ఆహార పదార్థాలను ఎందుకు కోరుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే రకరకాల పోషకాలు శరీరానికి అవసరం. అవి లోపించినపుడు క్రేవింగ్స్ కలుగుతాయి. కాబట్టి శరీరంలో పోషకాల లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడితే క్రేవింగ్స్ తగ్గుతాయని న్యూట్రిషనిస్ట్ రాబ్ హాబ్సన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా బరువు తగ్గేందుకు రకరకాల చిట్కాలను వివిధ నిపుణులు సూచిస్తున్నారు. సులభ మార్గాలకంటే ఇవే మంచిదని కూడా చెబుతున్నారు.


Also read : నీళ్లు మాత్రమే తాగి బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ మహిళ పరిస్థితి మీకూ రావచ్చు!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial