టీ కప్పుతో పాటు చాలా మంది డైజెస్టివ్ బిస్కెట్స్ కూడా పెట్టుకుని తింటారు. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ప్రత్యామ్నాయాలుగా ఉండే ఈ కుకీస్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే విధంగా తక్కువ తీపి రుచిని కలిగి ఉంటాయి. ముతక గోధుమ పిండి, కృత్రిమ రైజింగ్ ఏజెంట్లు, ఉప్పుతో తయారు చేస్తారు. రుచిని బట్టి బిస్కెట్లలో కొన్ని సార్లు ఓట్  మీల్, కల్చర్డ్ స్కిమ్డ్ మిల్క్, గింజల పొడి కూడా కలుపుతారు. ఆకలిని తగ్గించేందుకు, జీర్ణక్రియ మెరుగు పడేందుకు, బరువు తగ్గేందుకు సహాయపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయని అనుకుంటారు. కానీ ఈ డైజెస్టివ్ బిస్కెట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి.


డైజెస్టివ్ బిస్కెట్స్ వల్ల అనార్థాలు


ఆయిల్, మాల్ట్ ఎక్స్ ట్రాక్ట్, రైజింగ్ ఏజెంట్ వంటి పదార్థాలు డైజెస్టివ్ బిస్కెట్స్ లో ఉపయోగిస్తారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ బిస్కెట్లను అతిగా తినడం వల్ల ఎక్కువ హాని చేస్తుంది.


ఉబ్బరం


డైజెస్టివ్ బిస్కెట్స్ ఎక్కువగా గోధుమలతో తయారవుతాయి. వీటిలో ఇనులిన్ అధికంగా ఉంటుంది. ఈ సమ్మేళనం సహజమైన అరటి పండ్లు, గోధుమలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి అనేక ఇతర ఆహారాల్లో లభించే కార్బోహైడ్రేట్ ఫైబర్. ఇనులిన్ చిన్న పేగుల గుండా పెద్ద పేగుకు వెళుతుంది. అక్కడ అది మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రేరేపిస్తుంది.. చాలా మందిలో ఇది గ్యాస్, ఉబ్బరం, ఆపానవాయువు, విరోచనాలకు కారణమవుతుంది. అలాగే మాల్ట్ సారం అధికంగా తీసుకున్నప్పుడు ఆపానవాయువుకు కారణమవుతుంది.


ఆయిల్ దగ్గుకు కారణమవుతుంది


ఇందులో వాడే కూరగాయల నూనె ఉడికించినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఆరోగ్యానికి హానికరం. దగ్గుకు కారణమవుతుంది. జపనీస్ సొసైటీ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం కూరగాయల నూనె లైపోయిడ్ న్యుమోనియాకు కారణమవుతుంది. దీని వల్ల విపరీతమైన దగ్గు వస్తుంది.


రైజింగ్ ఏజెంట్ల వల్ల వికారం


చాలా మందికి సోడియం బైకార్బొనేట్ వంటి ఏజెంట్లను పెంచడం వల్ల అలర్జీ ఉంటుంది. దీని ఎక్కువగా బిస్కెట్లు, బ్రెడ్లు,బేక్డ్ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. డైజెస్టివ్ బిస్కెట్లు సోడియం బైకార్బోనెట్ లు ఉపయోగిస్తాయి. దీన్ని అతిగా తీసుకుంటే దాహం వేస్తుంది. కడుపు తిమ్మిరి, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి.


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక రక్తపోటు, గుండె వైఫల్యం లేదా మూత్రపిండాల వ్యాధి వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు డైజెస్టివ్ బిస్కెట్స్ తింటే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. సోడియం బైకార్బోనేట్ కడుపును గ్యాస్ ఏర్పరుస్తుంది. పేరుకే డైజెస్టివ్ బిస్కెట్స్ ఆరోగ్యమని అంటారు. కానీ ఇవి కూడా సాధారణ బిస్కెట్స్ మాదిరిగానే మారిపోయాయి. వీటిలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. అందుకే వీటిని అతిగా తినడం మంచిది కాదు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: లిప్ స్టిక్ వల్ల పెదాలు నల్లగా మారిపోతున్నాయా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు