Premenstrual Syndrome in Men : పీరియడ్స్ అనేవి కేవలం ఆడవారికే ఉంటాయి.. మగవారికి ఎందుకు ఉండవని ఫ్రస్టరేషన్లో చాలామంది అమ్మాయిలు అనుకునే ఉంటారు. అలాగే ఆ సమయంలో ఆడవారికి వచ్చే మూడ్ స్వింగ్స్‌ని మగవారు కూడా అర్థం చేసుకోలేరు. వాళ్లకొస్తే అర్థమయ్యేది మా బాధేంటో అని అమ్మాయిలు అనుకుంటారు. అయితే మీకు తెలుసా? నెలవారి పీరియడ్స్ మగవారికి కూడా ఉంటాయట తెలుసా? కానీ ఈ విషయమే వారికి తెలియదు పాపం. ఆడవారికి PMS ఉన్నట్లు.. మగవారికి IMS ఉంటుందట.
మగవారికి ఆడవారికి వచ్చినట్లు నెల నెల పీరియడ్ రాదు కానీ.. దానికి చాలా దగ్గరగా ఉండే ఓ ఫేజ్ ఉంటుందట. దానినే Irritable Male Syndrome అంటారు. ఇది కూడా సహజమైన జీవ ప్రక్రియే. ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్ వల్ల బ్లీడింగ్ ఉండదు కానీ.. మూడ్‌స్వింగ్స్ ఉంటాయి. ఆ సమయంలో చిరాకు, ఆందోళన, నిరాశతో ఉంటారట. దీనివల్ల అలసటగా ఉండడం, నిద్రలేమితో ఇబ్బంది పడడం లిబిడో తగ్గి సెక్స్‌పై కూడా ఆసక్తి రాదట. ఈ ఫేజ్ కొందరిలో ఉంటుందని.. కొందరిలో బయటపడదని చెప్తున్నారు నిపుణులు.
ఆ వయసు వారిలో..
IMS అనేది కామన్ కాకపోయినా.. 30 అయిపోతున్న వారిలో.. 40 వస్తోన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వివిధ కారణాల వల్ల ముందే కూడా ఇది స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో వారు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటారు. రీజన్ లేకుండా కోపం తెచ్చుకోవడం, దేనిపైనా ఫోకస్ చేయలేరు, ఇంట్రెస్ట్ చూపించలేరు.. శారీరకంగా కూడా యాక్టివ్‌గా ఉండలేరు. యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటుంది. ఇవే ఈ IMS లక్షణాలు. నెలలో ఓ రెండు, మూడు రోజులు ఈ లక్షణాలు ఉంటాయి.
IMS కారణాలు ఇవే..
మగవారికైనా.. ఆడవారికైనా హార్మోన్లలో అసమతుల్యతలు ఉంటాయి. మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం, మానసికంగా డిస్టర్బ్‌గా ఉండడం, చిరాకు పడేలా చేస్తుంది. దీనివల్ల IMS రావొచ్చు. అలాగే దీర్ఘకాలిక ఒత్తిడి కూడా ఈ సమస్యను పెంచుతుంది. హార్మోన్ల సమతుల్యత ఒత్తిడి వల్ల దెబ్బతిని.. ఆందోళనను, డిప్రెషన్‌ను పెంచుతుంది. సరైన వ్యాయామం లేకపోవడం, తగినంత నిద్రలేకపోవడం కూడా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. వివాహ బంధంలో విభేదాలు, ఒంటరితనం కూడా IMSకి దోహదం చేస్తాయి. హైపోథైరాయిడిజం, దీర్ఘకాలిక నొప్పులు, స్లీప్ ఆప్నియా కూడా దీనిని అభివృద్ధి చేస్తుంది.
చికిత్సలివే..
కొందరు ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్‌ని యాక్సెప్ట్ చేయరు. మరికొందరు దానిని గుర్తిస్తారు. అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇది కంట్రోల్లో ఉంటుంది. హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ, కౌన్సిలింగ్, జీవనశైలిలో మార్పులు చేయడం, వైద్యులు సూచించే మెడిసన్స్ వాడడం వల్ల ఇది అదుపులోకి వస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేందుకు ట్రై చేయండి. ఇది ఒత్తిడిని తగ్గించి మూడ్‌ని రిఫ్రెష్ చేస్తుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్‌ని ఫాలో అవ్వొచ్చు. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. సరైన నిద్ర ఉండేలా బెడ్ రొటీన్‌ని సెట్ చేసుకోండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుంటే మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.