పిరితీత్తులు, కణజాలాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్‌‌కు ముఖ్యమైనది ఐరన్. ఇది లోపిస్తే.. రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. దీన్ని మనం వివిధ ఆహారాల ద్వారా కూడా తీసుకోవచ్చు. ఎర్ర రక్త కణాలు.. కణజాలాలకు ఆక్సిజన్‌ను సమర్థవంతంగా రవాణా చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. కాబట్టి.. తప్పకుండా మీ శరీరంలో ఐరన్ లోపం ఏర్పడకుండా జాగ్రత్తపడాలి. మనం రోజువారీ తీసుకొనే ఆహారం ద్వారా కూడా ఐరన్ లభిస్తుంది. కానీ, కొందరు కేవలం సప్లిమెంట్లపైనే ఆధారపడతారు. ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం లెక్కల ప్రకారం.. రక్త హీనత సమస్య దరిచేరకూడదంటే..  కనీసం 20 మిల్లీ గ్రాముల ఐరన్ ఉండాలి. 


ఈ కింది లక్షణాల ద్వారా ఐరన్ లోపాన్ని గుర్తించవచ్చు: 
⦿ గుండె దడ
⦿ ఆయాసం
⦿ అలసట
⦿ శ్వాస ఆడకపోవుటం
⦿ దురదగా అనిపిస్తుంది
⦿ తలనొప్పి
⦿ నాలుక మృదువుగా మారడం 
⦿ ఆహారం మింగడంలో ఇబ్బంది
⦿ జుట్టు రాలడం
⦿ శక్తి లోపించి నీరసంగా ఉండటం 


గోళ్లు ఇలా మారినా ఐరన్ లోపం ఉన్నట్లే..:
⦿ గోళ్లు పాలిపోయినట్లు ఉండటం
⦿ గోళ్లు పెళుసుగా మారడం
⦿ లోహ రుచి (మెటాలిక్ టేస్ట్)


ఎవరికి ఎక్కువ ప్రమాదం?: ఐరన్ లోపం మహిళల్లోనే ఎక్కువగా ఏర్పడుతుంది. రుతుక్రమం వల్ల మహిళలు చాలా రక్తాన్ని కోల్పోతారు. అలాగే.. గర్భందాల్చే మహిళలు.. తమ కడుపులోని శిశువు పెరుగుదలకు రెట్లు అధిక ఇనుమ అవసరమవుతుంది. కాబట్టి.. మహిళలు ఐరన్ లోపం తలెత్తకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం, సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఒకవేళ మీరు సప్లిమెంట్లను తీసుకోవాలంటే.. వైద్యుల సూచనతో రోజుకు కనీసం 17 మిల్లీ గ్రాములు తీసుకోవాలి.    


ఏ వయస్సువారు ఎంత తీసుకోవాలి?
⦿ 18 ఏళ్లు పైబడిన పురుషులకు 8.7 మి.గ్రా.
⦿ 19-50 సంవత్సరాల వయస్సు గల స్త్రీలకు 14.8 మి.గ్రా.
⦿ 50 ఏళ్లు పైబడిన మహిళలు 8.7 మి.గ్రా. 


మీ శరీరంలో ఐరన్ శాతం పెరగాలంటే..: యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) చెప్పిన వివరాల ప్రకారం.. శరీరం ఐరన్‌ను గ్రహించేందుకు ఈ కింది సూచనలు పాటించండి.  
⦿ టీ లేదా పాలు వల్ల జీర్ణాశయంలో ఐరన్ శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి.. భోజనానికి ముందు, ఆ తర్వాత పాల ఉత్పత్తులను తీసుకోవద్దు.
⦿ శరీరం ఐరన్‌ను గ్రహించాలంటే ఆరెంజ్ జ్యూస్ తాగండి. ఐరన్‌ను గ్రహించేందుకు విటమిన్-సి సహాయపడుతుంది.
⦿ తాజా పండ్లు, కూరగాయలలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. 
⦿ సోయాబీన్, ఆఫ్రికాట్స్, ధాన్యాలు, పప్పులు, కిడ్నీ బీన్స్, తృణధాన్యాలు, రెడ్ మీట్, మాంసంలో లివర్ (గర్బధారణ సమయంలో తీసుకోకూడదు), మునక కాయలు.