Iron-Rich Foods : ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మహిళలలో పీరియడ్స్ సమయంలో, గర్భధారణ, హార్మోన్ మార్పులు వల్ల ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే మహిళలు ఐరన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తక్కువైతే వివిధ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐరన్ తక్కువైతే మహిళలు ఎదుర్కునే సమస్యలు ఏంటి? ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదో చూసేద్దాం. 

ఐరన్ తక్కువైతే కలిగే ఇబ్బందులు

ఐరన్ డెఫీషియన్సీ ఉంటే.. చాలా అలసటగా ఉంటుంది. తల తిరగడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే డైట్‌లో ఐరన్ రిచ్ ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు. అందుకే మహిళలు కొన్ని ఫుడ్స్ కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

పాలకూర

పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ C కూడా ఉండటం వల్ల ఐరన్ శరీరానికి సులభంగా అబ్జార్బ్ అవుతుంది. సూప్, పప్పు, కర్రీలలో వేసుకుని దీనిని తీసుకోవచ్చు. 

పప్పులు 

పప్పుల్లో ఐరన్‌తో పాటు ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి ఎనర్జీని పెంచి ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తాయి. నిమ్మరసం లేదా టమాటాతో తింటే ఇంకా మంచిది. 

బీట్‌రూట్ 

బీట్‌రూట్ రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. అందుకే దీనిని జ్యూస్ లేదా సలాడ్‌గా తీసుకోవచ్చు. 

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజలు చిన్నవే అయినా చాలా పవర్‌ఫుల్. ఐరన్, మాగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజుకు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. 

టోఫు 

వెజిటేరియన్స్‌కి టోఫు మంచి ఐరన్ సోర్స్. అలాగే మంచి ప్రోటీన్ కూడా ఇస్తుంది. దీనిని కర్రీ చేసుకుని లేదా ఫ్రైల్లో వాడుకోవచ్చు.

దానిమ్మ 

దానిమ్మ రక్త ప్రసరణను మెరుగుపరచి హిమోగ్లోబిన్ స్థాయిలను మెయింటైన్ చేస్తుంది. దీనిని జ్యూస్ లేదా నేరుగా తినవచ్చు. 

మరిన్ని టిప్స్

ఐరన్ శరీరానికి బాగా అబ్జార్బ్ అవ్వాలంటే విటమిన్ సి ఉండేవి తీసుకోవాలి. నిమ్మ, ఆరెంజ్, టమాటా వంటి వాటితో కలిపి తింటే మంచిది. అలాగే ఈ ఫుడ్స్ తీసుకున్న తర్వాత లేదా వైద్యులు సూచిన ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత.. వెంటనే టీ, కాఫీ తాగొద్దు. దీనివల్ల ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. భోజనం తర్వాత కనీసం 1 గంట గ్యాప్ ఇవ్వాలి. ఐరన్ పాత్రల్లో వంట చేసుకోవడం కూడా మంచి ఫలితాలు అందిస్తుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.