International Womens Day 2024 : తల్లిగా, చెల్లిగా, భార్యగా, అక్కగా, స్నేహితురాలిగా, సహోద్యోగిగా.. ఏదో రూపానా మీ జీవితంలో కొందరు మహిళలు ఉంటారు. ఎన్నో త్యాగాలు చేసి.. మిమ్మల్ని జీవితంలో ముందుకు నడిపిస్తున్న మహిళలు కూడా ఉంటారు. వారి పట్ల మీరు కృతజ్ఞత, అభిమానాన్ని తెలియజేయడానికి మహిళా దినోత్సవం పర్ఫెక్ట్ రోజు. మీరు వారికి గిఫ్ట్‌లు ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. వారు మీ జీవితంలో మీకు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ వారికో మెసేజ్ చేయొచ్చు. అయితే మీ భావాలను అక్షరాల్లో ఎలా రాయాలో తెలియట్లేదా? అస్సలు వర్రీ కాకండి. మీరు మీ లైఫ్‌లోని మహిళలకు ఏ విధంగా ఉమెన్స్ డే రోజు విష్ చేయాలో.. ఏమని మెసేజ్ పంపిస్తే వారు హ్యాపీగా ఫీల్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గౌరవిస్తూ ఉమెన్స్ డే నిర్వహిస్తారు. వివిధ రంగాల్లో మహిళలు చేస్తున్న కృషిని, సహకారాన్ని గుర్తిస్తూ.. వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ దీనిని నిర్వహిస్తారు. మీ జీవితంలోని మహిళలను అభినందిస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కోట్లు, సందేశాలను పంపిచాలనుకుంటే ఇలా పంపించేయండి.
- నీ జీవితానికి నువ్వే క్వీన్. క్వీన్స్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? వాళ్లు దేనికి భయపడరు. తమ వైఫల్యాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తారు. నువ్వు కూడా అలా వెళ్లాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే.
- సమాన హక్కులు ఎప్పుడైనా ప్రత్యేక హక్కులు కావు. అవి నీకు ఒకరు ఇచ్చేది కాదని గుర్తించుకో. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- మీరు జీవితంలో అన్ని విజయాలు సాధించాలని.. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నారు. హ్యాపీ ఇంటర్నెషనల్ ఉమెన్స్ డే.
- కష్ట, నష్టాలు ఎన్ని ఎదురైనా.. మీరు జీవితంలో ఎలాంటి సమయంలో కూడా ఆగిపోకూడదని.. మీరు కోరుకున్న జీవితాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే.
- సోదరిగా, కుమార్తెగా, తల్లిగా, భార్యగా.. ఇలా జీవితంలో ప్రతి దశలోనూ నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించి.. ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- స్త్రీలు ఎప్పుడూ బలహీనులు కాదు. ఎందుకంటే.. దేవుడు వారిని ప్రతి కోణంలోనూ బలవంతులుగా చేశారు. తమని తాము తక్కువ చేసుకోకుండా.. తక్కువ చేసే వారి మాటలు పట్టించుకోకుండా లైఫ్‌లో సకెస్స్ కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే.
- నా జీవితమంతా నువ్వు. నువ్వు లేకుంటే నేను లేను అమ్మ. నీకు థ్యాంక్స్ చెప్పడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నిన్ను మించి నా జీవితంలో ఎవరూ నన్ను ప్రేమించలేరు. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ.
- ఈరోజు నేను ఇంత ఉన్నత స్థానంలో ఉంటే అది నీ వల్లనే అమ్మ. నాకోసం నువ్వు చేసిన త్యాగాలను నేను వెలకట్టలేను. నీ గర్భంలో నాకు చోటిచ్చి.. నీ ప్రేమతో నన్ను పెంచి పెద్ద చేసిన నీకు ఎంత ప్రేమను అందించినా.. రుణం తీరదు. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
- నీకోసం నేను ప్రపంచాన్ని మార్చలేను. కానీ.. నీ గోల్స్ సాధించేందుకు, నీ ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు నేను ఆ ప్రపంచాన్ని ఎదురించగలను. హ్యాపీ ఉమెన్స్ డే.
- ప్రతి మహిళ తమ కాళ్లపై తాము నిలబడాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కుర్చోండి పోకూడదు. హ్యాపీ ఉమెన్స్ డే.
- బౌండరీలు సెట్ చేసి.. మహిళలు ఇదే చేయాలని రూల్ లేదు. కొన్నిసార్లు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బౌండరీలు దాటాల్సి వచ్చిన తప్పేమి కాదనే విషయం తెలుసుకోవాలి. హ్యాపీ ఉమెన్స్ డే.
Also Read : ఉమెన్స్ డే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. ఆ దేశాల్లో రెండ్రోజులు అధికారిక సెలవు