International Womens Day 2023: మహిళలను అమితంగా గౌరవించే రోజు ఏదైనా ఉందంటే అది అంతర్జాతీయ మహిళా దినోత్సవమే. ఈ రోజున ఎర్రటి గులాబీ బొకేలు, గ్రీటింగ్ కార్డులు, డిన్నర్ ప్లానింగ్‌లు... భార్యను, తల్లిని ఆనందింపజేసేందుకు మగమహరాజులు రెడీ అయిపోతూ ఉంటారు. ఏడాదంతా ఒక ఎత్తు, ఈ ఒక్కరోజు మరో ఎత్తు. ఏది ఏమైనా... మహిళల గొప్పతనాన్ని, వారి శ్రమను, త్యాగాన్ని గుర్తించేందుకు ప్రపంచస్థాయిలో ఒక రోజును కేటాయించడం మంచి పరిణామమే. అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా, కూతురిగా మగవాడికి అడుగడుగునా తోడై నిలిచే స్త్రీకి ఈ రోజున వారి గొప్పతనాన్ని చెప్పేలా అందమైన కోట్స్ తో శుభాకాంక్షలు చెప్పండి.  ‘హ్యాపీ వుమెన్స్ డే’ అని సింపుల్‌గా ఆంగ్లంలో కొట్టి పడేయకుండా, వారి విలువను చెప్పే కొటేషన్లను ఎంపిక చేసి మరీ మెసేజ్ రూపంలో పంపండి.


1. బంధం కోసం
బాధ్యత కోసం 
కుటుంబం కోసం 
అందరిని కనుపాపలా కాపాడుతూ 
ఆత్మీయతను పెంచి 
అహర్నిశలు కష్టించే 
స్త్రీ మూర్తికి పాదాభివందనాలు 
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


2. స్త్రీ లేకపోతే జననం లేదు 
స్త్రీ లేకపోతే గమనం లేదు 
స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు 
అందుకే మహిళలను గౌరవిద్దాం 
వారిని కాపాడుకుందాం 
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


3. అమ్మను పూజించండి 
భార్యను ప్రేమించండి 
సోదరిని దీవించండి 
అన్నిటికంటే ముఖ్యంగా 
మహిళను గౌరవించండి 
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


4. నీ జీవితంలో నలుగురు స్త్రీలను ఎప్పుడూ మరవకు
నిన్ను పుట్టించిన తల్లి 
నీతో పాటు పుట్టిన 
సోదరి నీకోసం పుట్టిన భార్య 
నీకు పుట్టిన కూతురు 
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


5. ‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ 
- స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


6. జీవిత చక్రంలో తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా, 
భార్యగా, కూతురిగా మారి 
బంధాలను నిలబెట్టిన ప్రతి మహిళకు అభివందనం. 
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.


7. కార్యేషు దాసి - కరణేషు మంత్రి - భోజ్యేషు మాత...
ఇలా సమస్తం నీవే...
అందుకే ఓ స్త్రీ మూర్తి అందుకో మా అభినందనలు
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


8. వందమంది కొడుకులున్నా
ఇంటికి కళ రాదు..
కానీ మహాలక్ష్మి లాంటి 
ఒక్క ఆడపిల్ల ఇంట్లో ఉంటే చాలు...
ఇళ్లంతా సందడే.
స్త్రీమూర్తులికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.


9. ఆకాశమే హద్దుగా...
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నా ఓ ఆధునిక మహిళా...
అందుకో మా ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


10. తల్లిగా మనకు జన్మనిచ్చి...
అక్కా, చెల్లిగా తన ప్రేమను పంచి...
భార్యగా తన జీవితాన్ని ధారపోసి...
బిడ్డగా అనురాగం పంచుతూ...
మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న
స్త్రీ మూర్తులకు...
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


11. కుటుంబం కోసం కెరీర్‌ను త్యాగం చేసే మహిళలు
వెనుకబడినట్టు కాదు, 
మగవారిని ముందుకు నడిపేందుకు
వారు వెనుక నడుస్తారు...
అందుకే ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని అంటారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


12. అర్థం చేసుకొనే నేర్పు..
అంతులేని సహనం..
ఏదైనా సాధించగలిగే మనోబలం..
గుండెలో దాచుకొనే ఔదార్యం..
అదే ఆమెలోని అందం..
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


13. నువ్వు కేవలం మహిళవి కావు
మానవాళిని కనే మహాశక్తివి
ప్రపంచాన్ని నడిపించే అద్భుత సృష్టివి
ఓ స్త్రీమూర్తి అందులో మా వందనాలు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


Also read: మహిళలూ ప్రతిరోజూ మీరు ఆహారంలో చేర్చుకోవాల్సిన ముఖ్యమైన పోషకాలు ఇవే


Also read: ప్రతి భారతీయ మహిళా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన హక్కులు, చట్టాల జాబితా ఇదిగో