టా మార్చి 8న అన్ని దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు మహిళల విజయాన్ని, సమాజానికి వారి సహకారాన్ని గుర్తిస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. తమ చుట్టూ ఉన్న మహిళలకు బహుమతులు ఇవ్వడం ద్వారా, లేదా గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా సంతోషపెడతారు. వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ చుట్టూ ఉన్న మహిళలను సంతోషపెట్టాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే, మీ కోసమే ఈ గిఫ్ట్ ఐడియాలు. వీటిలో మీకు నచ్చిన వాటిని ఉపయోగించి మీరు అమితంగా ఇష్టపడే మహిళలను సంతోష పెట్టండి.   


1. నగలు


మహిళా దినోత్సవం రోజున మీరు ఎక్కువగా ఇష్టపడే వారికి ఆభరణాలను బహుమతిగా ఇవ్వడం ఉత్తమమైన మార్గంగా చెప్పుకోవచ్చు. ఈ బహుమతితో మీ ప్రియమైన వారి ముఖాల్లో చిరునవ్వు చూసే అవకాశం ఉంటుంది. నెక్లెస్‌లు, పెండెంట్ ఇయర్ రింగ్స్, బ్రాస్‌ లెట్లు సహా ఎన్నో ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. మీ స్థాయికి తగిన విధమైన నగలను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. 


2. స్పా కూపన్లు


ఎవరికైనా కొన్ని గంటల పాటు ప్రశాంతమైన విశ్రాంతిని బహుమతిగా ఇవ్వాలి అనుకునే వారు స్పా కూపన్లు ఇవ్వండం బెస్ట్. మీ చుట్టు పక్కల ఉన్న మహిళలకు అందించే ఉత్తమ బహుమతులలో స్పా ఒకటి.  దీని ద్వారా వారు ఇతరుల గురించి కాకుండా తమ గురించి కొన్ని గంటలు ఆలోచిస్తూ ఆనందిస్తారు. మీరు స్పా కూపన్‌ ఏర్పాటు చేయలేకపోతే, బబుల్ బాత్‌లు, షవర్ జెల్, బాత్ క్రిస్టల్స్‌ తో కూడిన స్పా బాస్కెట్‌ ను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.


3. మేకప్ బ్యాగులు, మేకప్ కిట్లు


మహిళలకు మేకప్ అనేది అత్యంత ఇష్టమైనది. అందుకే మేకప్ బ్యాగులు, మేకప్ కిట్లు అందించడం ద్వారా వారు చాలా సంతోషపడతారు. అయితే, ఎవరికైనా మేకప్‌ కిట్లను బహుమతిగా ఇస్తున్నప్పుడు, వారు ఇష్టపడే, ఇంతకు ముందు వారు ఉపయోగించిన ఉత్పత్తులను ఇవ్వడం మంచిది. మేకప్ ప్రొడక్ట్స్ కాకపోతే, మీరు వారికి మన్నికైన జిప్పర్‌తో మేకప్ ఆర్గనైజర్‌ని కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.


4. డెసెర్ట్‌లు


డెజర్ట్‌లు ప్రతి ఒక్కరినీ సంతోషపెడుతాయి. మీ చుట్టూ ఉన్న మహిళలకు  డెజర్ట్‌లను బహుమతిగా ఇవ్వడం చాలా ఉత్తమం. చాక్లెట్లు, కేకులు, పేస్ట్రీలు,  డోనట్స్ సైతం బెస్ట్ సెలెక్షన్ గా భావించవచ్చు. వారికి నచ్చిన కేకులు, స్వీట్స్ సైతం బహుమతిగా ఇవ్వవచ్చు.   


5. పెర్ఫ్యూమ్


మేకప్ కిట్ లాగా, పెర్ఫ్యూమ్ కూడా మంచి గిఫ్ట్ అవుతుంది. అయితే, మనం ఇచ్చే వారికి ఆ పెర్ఫ్యూమ్ నచ్చుతుందో? లేదో? అని ముందుగా తెలుసుకోవాలి. వారికి నచ్చిన, వారు ఎక్కువగా ఇష్టపడే పెర్ఫ్యూమ్ ను అందించడం ద్వారా వారిని సంతోషంగా ఉంచే అవకాశం ఉంటుంది. అయితే, స్కిన్ సంబంధ ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఈ బహుమతి ఇవ్వకపోవడం మంచిది. మొత్తంగా ఈ ఐదింటిలో నచ్చిన పద్దతి ద్వారా మీకు నచ్చిన వారిని సర్ ప్రైజ్ చేయండి. 


Read Also: మాయాబజార్ To ఆర్ఆర్ఆర్ - వసూళ్లే కాదు, వీక్షకులూ ఎక్కువే - ఏయే మూవీని ఎంతమంది చూశారంటే..