కడుపు నిండా తింటూనే బరువు తగ్గాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. పొట్ట మాడ్చుకుని ఉండాలంటే కాస్త కష్టమే. దీని వల్ల ఆకలి, చిరాకు, శక్తి కోల్పోవాల్సి వస్తుంది. వీటి వల్ల అంతర్లీన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆహారం లేకపోవడం వల్ల శరీర పనితీరు నాశనం అవుతుంది. నోరు కట్టేసుకుని బరువు తగ్గించుకోవడం కంటే సమతుల్య ఆహారం తీసుకుంటే కొవ్వు పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. కాలానుగుణ కూరగాయలు, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఇస్తామయిన ఆహారాలతో కేలరీలు తగ్గించుకోవచ్చు.


దీర్ఘకాలిక బరువు తగ్గించుకోవడం కోసం చూస్తున్నట్టయితే క్రాష్ డైట్, యో యో డైట్ లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన బరువు తగ్గించే ప్రయాణాన్ని తగ్గించుకోవడం కోసం ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టమైనవి తింటూనే బరువు తగ్గవచ్చు.


బుద్ధిగా తినేయండి


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మైండ్ ఫుల్ గా తినడం అనేది ఆరోగ్యకరమైన జీవితానికి మొదటి అడుగు. శారీరక, భావోద్వేగ ఆకలి మధ్య తేడాను గుర్తించాలి. ఇది ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి మద్ధతు ఇస్తుంది. హార్వర్డ్ హెల్త్ ప్రకారం బుద్ధి పూర్వకంగా తినడం అంటే బౌద్ధ భావన. అందుకే ఇలా తినాలి..


⦿ఎలాంటి పరధ్యానం లేకుండా నెమ్మదిగా తినాలి


⦿మీకు పొట్ట నిండుగా అయ్యింది అనేవరకు తినండి


⦿నిజమైన ఆకలి, దాహానికి మధ్య తేడాను గుర్తించుకోవడం నేర్చుకోవాలి


⦿ఆకలితో తింటున్నామా, ఆందోళనలో తింటున్నామా అనేది గ్రహించాలి


⦿ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చక్కగా తినాలి


హైడ్రేట్ గా ఉండాలి


కొన్ని అధ్యయనాల ప్రకారం నీరు వివిధ మార్గాల్లో బరువు తగ్గడానికి గొప్పగా సహాయపడుతుంది. ఆకలిని అణచివేయడంలో సహాయపడటమే కాకుండా జీవక్రియను పెంచుతుంది. వ్యాయామాన్ని సులభతరం చేస్తుంది. సమర్థవంతంగా పని చేస్తుంది. క్రమం తప్పకుండా నీరు తాగడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. అతిగా తినదాన్ని నివారిస్తుంది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం నీరు శరీర జీవక్రియ, శక్తిని ప్రేరేపిస్తుంది.


ప్రాసెస్, జంక్ ఫుడ్ వద్దు


బరువు తగ్గించే మిషన్ లో మీరు ఉన్నప్పుడు ఆహారాలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. జంక్, ప్రాసెస్ చేసిన ఆహారం దూరం పెట్టాలి. ఇది రుచికరంగా ఉన్నప్పటికీ అనారోగ్యకరమైనది. చక్కెర, ఉప్పు, శుద్ధి చేసిన పిండి పదార్థాలు తీసుకుంటే అదనపు కేలరీలు జోడించినట్టే. బరువు తగ్గడం మరింత సవాలుగా మారుతుంది. హార్వర్డ్ టీ హెచ్ ప్రకారం చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం ఇవి ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.


తినే ప్లేట్ చిన్నది చేసుకోండి


పెద్ద ప్లేట్ తీసుకుంటే దాని నిండుగా ఆహరం పెట్టుకుని ఎక్కువగా తింటారు. అందుకే ప్లేట్ లో ఉంచే ఆహారాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. ప్లేట్లు, చెమ్చాలు, గ్లాసుల పరిమాణాలు ఎవరైనా ఎంత ఆహారం తింటున్నారో తెలియకుండానే ప్రభావితం చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందుకే సాధారణ ప్లేట్, చిన్న గిన్నె, సర్వింగ్ స్పూన్ చిన్నదిగా ఉండేలా చూసుకోండి. అతిగా తినడాన్ని నిరోధించవచ్చు.


భోజనం ప్లేట్ ఇలా ఉండాలి


కూరగాయల సలాడ్: సగం ప్లేట్


అధిక నాణ్యత ప్రోటీన్: క్వార్టర్ ప్లేట్


కాంప్లెక్స్ పిండి పదార్థాలు: క్వార్టర్ ప్లేట్


అధిక కొవ్వు ఆహారాలు: అర టేబుల్ స్పూన్ లేదా 7 గ్రాములు


క్రమం తప్పకుండా వ్యాయామం


రేగియిలర్ స్థిరమైన వ్యాయామం మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు మితమైన వ్యాయామం చేయడం మంచిది. జాగింగ్, చురుకైన నడక, సైక్లింగ్ వంటివి చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి