Fertility and Thyroid: ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో పేరుతో వ్యాపిస్తుంది. వైద్యపరిభాషలో దీన్ని హైపోథైరాయిడిజం అని కూడా అంటారు. థైరాయిడ్ గ్రంథి సరైన మొత్తంలో థైరాయిడ్ హార్మోన్‌ను విడుదల చేయకపోవడం వల్లనే ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు తేల్చుతున్నారు. అయితే ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి. థైరాయిడ్ గ్రంధి నుంచి ఎక్కువ మొత్తంలో థైరాయిడ్ హార్మోన్ విడుదలైనట్లయితే హైపర్ థైరాయిడిజం అని, తక్కువ మొత్తంలో థైరాయిడ్ హార్మోన్ విడుదలైనట్లయితే హైపోథైరాయిడిజం అని పిలుస్తున్నారు. అయితే థైరాయిడ్ హార్మోన్ అనేది సంతాన సమస్యలకు కూడా కారణం అవుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంధి మూలంగా సంతానలేమి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.


థైరాయిడ్ సమస్య కారణంగా సంతాన లేమి:


థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అనేక జీవక్రియలు కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాయిడ్ హార్మోన్ సరైన మొత్తంలో శరీరంలో విడుదల కాకపోతే పలు రుగ్మతలకు దారి తీసే అవకాశం ఉంది. హైపర్ హైపో ఈ రెండు రకాల థైరాయిడ్ రుగ్మతల వల్ల సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ హార్మోన్ సంతాన సమస్యలకు కారణం అవుతుంది. అండాశయంలో జరిగే పరిణామాలకు థైరాయిడ్ హార్మోన్ కారణమయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం కారణంగా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. తద్వారా శరీరంలో కావాల్సినంత థైరాయిడ్ హార్మోన్ విడుదల కాదు. ఈ కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు పెరగడం ద్వారా సంతానలేమి సమస్యలు మహిళల్లో తలెత్తే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


హైపోథైరాయిడిజం పురుషుల్లో లైంగిక చర్యలను నిరోధిస్తుంది:


ఇక పురుషుల్లో హైపోథైరాయిడిజం కారణంగా సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం కారణంగా శుక్ర కణాల్లో చలనం సరిగా ఉండదని వైద్యులు చెబుతున్నారు. అలాగే స్పర్మ్ క్వాంటిటీ, క్వాలిటీ విషయంలో కూడా థైరాయిడ్ కారణంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. హైపోథైరాయిడిజం కారణంగా లైంగికంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తద్వారా అంగస్తంభనలు సరిగ్గా లేకపోవడం, శుక్రకణాల్లో కదలిక లేకపోవడం కారణంగా అండాశయంలో అండాన్ని చేరుకోవడం, శుక్రకణాలు విఫలమయ్యే అవకాశం ఉందని, తద్వారా సంతాన లేమి సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక హైపోథైరాయిడిజం మహిళల్లో కూడా రుతుక్రమం దెబ్బతీసేందుకు దోహదపడుతుందని వైద్యులు చెబుతున్నారు. రుతుక్రమం దెబ్బ తినడం వల్ల అండం సరైన సమయంలో విడుదల కాదని, ఫలితంగా సంతాన ఉత్పత్తికి అవసరమైన ప్రక్రియ నెమ్మదిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. 


హైపర్, హైపో థైరాయిడిజం వల్ల సంతాన లేమి సమస్య:


ఇక హైపర్, హైపో ఈ రెండు రకాల థైరాయిడ్ సమస్యలు కారణంగా సంతానలేమి సమస్యలు పెద్ద ఎత్తున వస్తున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం విషయంలో బరువు పెద్ద ఎత్తున కోల్పోవడం, గుండె సమస్యలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మహిళల్లో హైపర్ థైరాయిడిజం కారణంగా పీరియడ్స్ సరైన సమయంలో రాకపోవడం ఒక సమస్యగా కనిపిస్తుంది. ఇక పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. 


థైరాయిడిజం సమస్యలను ఎలా గుర్తించాలి:


థైరాయిడ్ సమస్యలను గుర్తించేందుకు రెండు రకాల రక్త పరీక్షలు ఉన్నాయి. అందులో మొదటిది TSH పరీక్ష, TPO పరీక్ష. సంతానం కోసం ప్లాన్ చేస్తున్న దంపతులు.. వైద్యుల సూచన మేరకు థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. తద్వారా వారికి ఉన్న సమస్యలను గుర్తించవచ్చు. థైరాయిడ్ సమస్యకు మందుల రూపంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయం లభించింది. థైరాయిడ్ మందులను రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా హైపర్ హైపోథైరాయిడిజం జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.


Also Read : ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ గుండె పదిలంగా ఉంటుంది


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.