కుళాయిల నుంచి నేరుగా వచ్చే నీరు బ్యాక్టీరియా, హానికరమైన టాక్సిన్లతో నిండి ఉంటుందని ఇప్పుడు ప్రతీ ఒక్కరూ RO సిస్టమ్ ఉపయోగిస్తున్నారు. ఫ్రిజ్, మిక్సీ మాదిరిగానే ఈ RO కూడా అత్యవసర వస్తువుగా మారిపోయింది. నగరాల నుంచి గ్రామాల వరకు ప్రజలు స్వచ్చమైన, ఆరోగ్యకరమైన నీటిని తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాటిని ఈ రివర్స్ అస్మాసిస్ సిస్టమ్ అందిస్తాయని విశ్వసిస్తున్నారు. కానీ ఇవి నిజంగానే ఆరోగ్యాన్ని ఇస్తాయా?
శుద్ధి చేసిన దాని కంటే ఎక్కువ నీరు వృధా
నిజం చెప్పాలంటే ఈ RO వాటర్ ఫ్యూరిఫైయర్ శుద్ది చేసే నీటి పరిమాణం కంటే మూడు రెట్లు నీటిని వృధా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక లీటర్ నీరు శుద్ది అయితే మూడు లీటర్ల నీరు వేస్ట్ గా పోతుంది. స్వచ్చమైన నీటిని పొందాలని అనుకుంటే అందుకు RO సిస్టమ్ ఎంచుకోవాల్సిన అవసరం లేదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు చేసిన అధ్యయనం వెల్లడిస్తోంది. RO వ్యవస్థ ద్వారా ప్రతి పది లీటర్ల నీటికి మూడు లీటర్ల మంచి నీరు లభిస్తుంది. మిగిలిన ఏడు లీటర్లు మురుగు నీటి లైన్ల ద్వారా భూగర్బ జలాల్లో కలుస్తుంది. ఇది వాటికి మరింత కాలుష్యాన్ని జోడిస్తుందని పరిశోధకులు తెలిపారు.
2021-22 లో పశ్చిమ బెంగాల్ లోని హల్దీయా లో డాక్టర్ మిశ్రా, అతని బృందం విస్తృతంగా అధ్యయనం నిర్వహించింది. అక్కడ సీసంతో సహా లోహ సాంద్రత అనుకున్న దాని కంటే చాలా తక్కువగా ఉందని వాళ్ళు కనుగొన్నారు.
స్వచ్చమైన నీరు మంచి కంటే హాని ఎక్కువ
RO వాటర్ అన్ని సహజ ఖనిజాలు, ఆయాన్లని తొలగిస్తుంది. దీని గురించి ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ చీమను చంపేందుకు దుప్పటి ఉపయోగించినట్టు ఉంటుందని ఐఐటీ కాన్పూర్ అసోసియేషన్ ప్రొఫెసర్ ఒకరు చెప్పుకొచ్చారు. RO చేసేది నీటి నుంచి మొత్తం కరిగిన ఘనపదార్థాలు తీసేసి దాన్ని స్వచ్చమైన దానిగా మారుస్తుంది. ఇవి ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా ఆరోగ్య ప్రభావాలు చూపిస్తుంది.
సురక్షితమైన తాగునీరు అంటే?
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం తాగునీటిలో TDS స్థాయిల పరిమితి 500 ppm ఉండాలి. WHO 300 ppm పరిమితి చెప్పింది. కానీ దీని కంటే ఎక్కువ ఉంటే ఆరోగ్య ప్రభావాలని కలిగిస్తుందని చెప్పలేదు.
RO ఉండాల్సిన అవసరం ఏమి లేదని అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు అంటున్నారు. పెట్రోకెమికల్ పరిశ్రమలు ఉన్న కొన్ని ప్రాంతాలు మినహా చాలా ప్రదేశాలలో లభించే నీటిలో కొంత జింక్ ఉంటుంది. మిగిలిన అన్నీ జలాలు నేరుగా తాగడానికి అనువుగా ఉంటునాయి. నీటిలోని బ్యాక్టీరియా తొలిగించేందుకు కాచుకుని వడకట్టుకుని తాగడం మేలు. ఇది ఖర్చులేని సులభమైన మార్గం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: సిగరెట్లు తాగితే నాలుకపై వెంటుకలు వస్తాయా? ఇతడి నరకయాతన చూస్తే వణికిపోతారు!