Cancer Diet: క్యాన్సర్ ప్రమాదకరమైన.. ప్రాణాంతక వ్యాధి. క్యాన్సర్‌కు అనేక చికిత్సలు ఉన్నప్పటికీ.. ప్రపంచంలో అత్యధిక మరణాలకు క్యాన్సరే రెండో అతిపెద్ద కారణంగా నిలుస్తోంది. సరైన సమయంలో క్యాన్సర్ వ్యాధి లక్షణాలను గుర్తించడం ద్వారా దానిని నయం చేసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. క్యాన్సర్ కానీ లేదా మరేదైనా వ్యాధి కావచ్చు.. ఆరోగ్యకరమైన ఆహారం అన్నింటిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే చాలామంది క్యాన్సర్‌ను నివారించడంలో ఏం తినాలో తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మనం రోజూ తినే ఆహారాలు క్యాన్సర్ నివారిస్తాయి. 


బ్రోకలీ:


బ్రోకలీలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. శీతాకాలంలో విరిగా లభించే బ్రోకలీలో క్యాన్సర్ నిరోధక సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఇందులో సల్ఫోరా ఫేన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. దీంతోపాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా అధిక మోతాదులో ఉన్నాయి. నిత్యం బ్రోకలీని ఆహారం చేర్చుకుంటే ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. 


బెర్రీలు:


చిన్న బెర్రీలలో అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్బ్పెర్రీస్ వంటి రంగురంగుల బెర్రీలు రుచిలోనే కాదు..ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కు దారితీసే హానికరమైన ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి. వీటిని తరుచుగా డైట్లో చేర్చుకోవడం మంచిది. 


వెల్లుల్లి:


భారతీయుల వంటకాల్లో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే లెహ్సన్ క్యాన్సర్ కణాల వ్రుద్ధిని అడ్డుకుంటుంది. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు క్యాన్సర్ నిరోధకాలు సహాయపడతాయి. రోగనిరోధకశక్తి పెంచే లక్షణాలు క్యాన్సర్ కారక కణాలపై పోరాడుతాయి. 


పసుపు:


పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. సాధారణంగా ప్రతి- వంటకంలోనూ పసుపును వాడుతారు. దానివల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.


గ్రీన్ టీ:


గ్రీన్ టీ యాంటీఆక్సిడెంట్లకు నిధి. ఇది  క్యాన్సర్ నే ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. గ్రీన్ టీ లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తితోపాటు.. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 


టమోటాలు:


టొమాటోలు లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌తో నిండి ఉంటాయి. టమాటో ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ నుండి సురక్షితంగా ఉండేందుకు ప్రతిరోజూ మీ ఆహారంలో కనీసం ఒక టమోటా అయినా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


ఆకుకూరలు:


ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్ వంటి పచ్చని ఆకు కూరల్లో సహజ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వాటిలో గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనాలు కూడా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ రక్షణలో కీలక  పాత్ర పోషిస్తాయి. మీ ఆహారంలో నిత్యం ఆకుకూరలను చేర్చుకున్నట్లయితే.. క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. 


Also Read : రోజంతా యాక్టివ్​గా ఉండేందుకు.. మీ రోటీన్​లో వీటిని చేర్చుకోండి
























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.