Sleeping Tips: ఈ రోజుల్లో చాలా మంది రాత్రి నిద్రపట్టక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ఆందోళన కారణంగా చాలా మందికి కంటి నిద్ర కరువైంది. బాగా నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. అందుకే చాలా మంది రాత్రిళ్ళు ఒకటి, రెండు గంటల వరకు ఫోన్లు, టీవీలు చూస్తూ గడిపేస్తున్నారు. అంతేకాదు రాత్రి ఆలస్యంగా నిద్రిస్తే.. మీకు శరీరానికి కావాల్సిన నిద్రను అందించలేరు. మళ్లీ ఉదయాన్నే మేల్కోవాలి. తద్వారా మీరు రోజంతా నీరసంగా ఉంటారు. అందుకే కొంతమంది స్లీపింగ్ పిల్స్ కూడా తీసుకుంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం. మరి రాత్రి గాఢమైన నిద్ర పట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


రాత్రి కంటినిండా నిద్రపోవాలంటే కొన్ని భంగిమలు మార్చుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవును మనం నిద్రించే భంగిమ మన నిద్రపై ప్రభావం చూపుతుంది. కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా పడుకుంటారు. అది వారికి కంఫర్ట్ గా ఉండకపోవడం నిద్రరాదు. మనం కూర్చునే, నిలబడే, కదిలే విధానం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే మనలో చాలా మంది తెలియకుండానే తప్పుడు భంగిమల్లో నిద్రిస్తుంటారు. మనం కంటినిద్ర పోవాలంటే ఈ మూడు భంగిమలను మార్చుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 


1. ఒక కాలుపై మరోకాలు వేసి పడుకోవడం:


మనలో చాలా మంది పడుకున్నప్పుడు కాలుపై కాలు వేసుకుని నిద్రిస్తుంటారు. కాలుపై కాలు వేసుకుని పడుకుంటే కటి ఎముకలపై ఒత్తిడి పెరిగి.. నిద్రపై ప్రభావం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఇలా పడుకోవడం వల్ల వెన్నెముక అమరికపై కూడా ఎఫెక్ట్ పడుతుందట. దీంతో పొత్తికడుపులో, తుంటి, వీపు దిగువ భాగంలో నొప్పి వస్తుంది. భవిష్యత్తులో ఈ నొప్పులు నరకం చూపిస్తాయి.


2. బోర్ల పడుకోవడం:


కొంతమందికి బోర్ల పడుకోవడం అలవాటు ఉంటుంది. కానీ ఇది సరైన భంగిమ కాదు. ఊపిరిపీల్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు ఒత్తిడి, అసౌకర్యానికి కారణం అవుతుంది. వీపు ఎక్కువగా వంగడం వల్ల కటి వెన్నెముక, కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు శ్వాసకోశ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. 


3. మీ మెడను మెలితిప్పడం :


మెడను పక్కకు తిప్పి పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా పడుకోవడం నరాల నొప్పికి కారణం కావచ్చు. మెడను తిప్పుతూ పడుకోవడం వల్ల నరాలు పట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇది మెడలో ఉండే సున్నితమైన నిర్మాణాలపై ప్రభావం చూపుతుంది. గాయాలు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఎక్కువగా హాని కలిగిస్తుందని గుర్తుంచుకోండి. ఈ అలవాటును మానుకోలేని వారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. 


Also Read : ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోగలిగే పాలకూర వడలు.. రెసిపీ ఇదే











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.