రాత్రిపూట ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు చూస్తూ ఎంతోమంది మంచి నిద్రకు దూరమవుతున్నారు. అధిక స్క్రీన్ సమయం వల్ల నిద్రించే సమయం తగ్గిపోయింది. ఇలా నిద్ర తగ్గడం వల్ల ఆరోగ్యంతో పాటు అందానికి ఎంతో నష్టం. రాత్రిపూట నగ్నంగా నిద్రించడం వల్ల ఆరోగ్యాన్ని పెంచుకోవడంతో పాటు బరువు కూడా సులువుగా తగ్గవచ్చని చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు.


మన శరీరం ఉష్ణోగ్రత సాయంత్రమయ్యేసరికి తగ్గిపోతూ ఉంటుంది. మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం అనేది రాత్రికి మంచిగా నిద్ర పట్టడానికి కీలకమైన అంశం. మందపాటి దుస్తులు వేసుకోవడం వల్ల శరీరం సహజంగా చల్లబడదు. అందుకే రాత్రి నిద్రపోయే ముందు నగ్నంగా నిద్రించడం వల్ల చక్కగా నిద్ర పడుతుందని చెబుతున్నారు పరిశోధనకర్తలు. పూర్తిగా నగ్నంగా ఉండలేని వారు అతి తక్కువ దుస్తులు ధరించి నిద్రపోవడం మంచిది. అంటే శరీరంలో 80% నగ్నంగా ఉండటమే మంచిది. ఇది రాత్రిపూట మీ చర్మం ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడుతుంది.


వేసవికాలంలో రాత్రి నిద్ర పోయేటప్పుడు లోదుస్తులు ధరించకపోవడమే మంచిది. ఇవి చెమట, తేమను పట్టి ఉంచుతాయి. దీనివల్ల జననేంద్రియాల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఏర్పడవచ్చు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. రాత్రిపూట బాగా నిద్రపోతే మీ ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఉదయం లేచాక చురుకుగా పనిచేసే అవకాశం ఉంది.


శరీరం సౌకర్యవంతంగా, హాయిగా ఉన్నప్పుడే మీకు సరైన నిద్ర పడుతుంది. ఇలా నిద్ర పోవాలంటే శరీరమంతా గాలి తగులుతూ ఉండాలి. అందుకే నగ్నంగా నిద్రించమని చెబుతుంటారు పరిశోధనకర్తలు.  ఇలా నగ్నంగా నిద్రించడం వల్ల గ్రోత్ హార్మోన్స్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. చర్మం, జుట్టు చక్కగా ఎదుగుతాయి. రాత్రిపూట నగ్నంగా నిద్రించడం వల్ల అందం కూడా పెరుగుతుంది. చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. బరువు పెరిగే సమస్య కూడా అదుపులో ఉంటుంది. ఐదు గంటలకంటే తక్కువ సమయం నిద్రించే వారిలో బరువు పెరిగే సమస్య ఎక్కువ. నగ్నంగా నిద్రించడం వల్ల రాత్రిపూట మీ శరీరం చల్లగా ఉంటుంది. దీనివల్ల ఇంకా ఎక్కువ సమయం నిద్రపోయే అవకాశం ఉంది. రాత్రిపూట నగ్నంగా నిద్రించలేని వారు తేలికైన బట్టలు వేసుకోవాలి. వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. ఇది అందానికి ఆరోగ్యానికి ఎంతో మంచిది.  అమెరికా వంటి దేశాల్లో ప్రతి వంద మందిలో 40 మంది నగ్నంగానే నిద్రిస్తారట. వారికి గాఢనిద్ర పట్టేస్తుందట.


Also read: ఇలాంటి పనులు చేస్తే మైగ్రేన్ సమస్య ఇంకా పెరిగిపోతుంది, జాగ్రత్త




Also read: ఆగకుండా డాన్స్ చేయడమే ఈ వ్యాధి లక్షణం, వందల మంది దీని బారిన పడ్డారు

























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.