చదువు, కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగెయ్యాలి. ఎలాంటి కెరీర్ కావాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకన్నాకే దానికి కావాల్సిన చదువును పూర్తిచేయాలి. ఇక ఉద్యోగం మొదలుపెట్టాక మీరు చేసే ప్రతి పని, తప్పు కూడా కెరీర్ పై ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి కెరీర్ లో మీరు చేసే చిన్న పొరపాటు భారీ నష్టానికి కారణం కావచ్చు. మీ వృత్తి జీవితంలో వేసే ప్రతి అడుగు సరైనదని నిర్ణయించుకున్నాకే వేయాలి. కెరీర్ విషయంలో ఎక్కువ మంది చేసే తప్పులు ఇవే.


డబ్బు వెంట పరుగులు
మీరు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లే కావచ్చు, కానీ కెరీర్ బాగుంటే డబ్బు దానంతట అదే వస్తుంది. కాబట్టి ముందు కెరీర్ కి ప్రాధాన్యతనివ్వండి. అతి తక్కువ కాలంలోనే జీతం కోసం ఎక్కువ కంపెనీలు మారకండి. ఇది మీపై చెడు అభిప్రాయాన్ని పెంచుతాయి. ప్రొఫైల్ లో మరీ ఎక్కువగా అధిక సంస్థలు కనిపించడం, అది కూడా అతి తక్కువ కాలపరిమితి పనిచేసినట్టు ఉండడం మంచిది కాదు. 


ఎంతిస్తే అంత ఒప్పుకోకండి...
మీ స్కిల్స్, మీ పనితనం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు అతి తక్కువ జీతానికే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. హెచ్ఆర్ చెప్పిన శాలరీకే ఒప్పుకోవాలని ఎక్కడా లేదు. మిమ్మల్ని వారు ఎంపిక చేశారంటే, మీలో వారికి మంచి ఉద్యోగి లక్షణాలు కనిపించి ఉండాలి కనుక. ఆ ఉద్యోగంలో చేరాలా, వద్దా అనేది నిర్ణయించుకుని, శాలరీ కూడా అప్పటి ట్రెండ్ కు తగ్గట్టు అడగండి. 


అతి నైపుణ్యాలు అనర్ధమే 
మీ కెరీర్ కు సంబంధించి ఏ రంగంలో సాగాలనుకుంటున్నారో ముందే గట్టిగా నిర్ణయించుకోండి. ఆ రంగానికి సంబంధించిన లేదా ఆ పనికి సంబంధించిన నైపుణ్యాలను పూర్తిగా సంపాదించండి. రెండు మూడు రంగాల వైపు చూడొద్దు, అన్ని రకాల నైపుణ్యాలు నేర్చుకోవాలని అనుకోవద్దు. మీరు ఎన్ని విషయాలు నేర్చుకున్నా రాణించగలిగేది మాత్రం ఒక రంగంలోనే. 


నెట్ వర్కింగ్ అవసరం
వృత్తిపరమైన పరిచయాలనే నెట్ వర్కింగ్ అంటారు. ఇది చాలా ముఖ్యం. మీ రంగంలో రాణిస్తున్న వారు, వేరే సంస్థల్లో పనిచేస్తున్న వారు, భావ సారూప్యత గల వ్యక్తులతో స్నేహంగా ఉండడం అవసరం. ఇప్పుడు ఆన్ లైన్ నెట్ వర్కింగ్ సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 
 
సెల్ఫ్ ప్రమోటింగ్
మీరు చేసే పనిని బాస్ గుర్తించాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ కొంతమంది ఆయన గుర్తించే వరకు నిశ్శబ్ధంగా పనిచేసుకుని వెళుతుంటారు.నిజానికి మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడం కూడా చాలా అవసరం.మీ పనితనాన్ని, విజయాలను అప్పుడప్పుడు మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లాలి. 
 వంతం కావచ్చు.


ఇలా చేయద్దు
ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితాన్ని మీ వృత్తి జీవితంలోకి తీసుకురావద్దు. మీ సహోద్యోగులతో మీ ఇంటి సమస్యల గురించి ఎప్పుడూ చెప్పకండి. అలా చెప్పినందుకు మీరే బాధపడాల్సిన సందర్భాలు రావచ్చు. 


Also read: ఆ నటి మెదడులో కొంత భాగం పనిచేయదు, కారణం బ్రెయిన్ అనూరిజం, ఏంటి ఈ సమస్య?


Also read: మొటిమలతో విసిగిపోయారా? ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే ఇట్టే తగ్గిపోతాయి