మధుమేహరోగులు ముందుగా ప్రీ డయాబెటిక్ దశను దాటే డయాబెటిక్‌గా మారుతారు. ప్రీ డయాబెటిక్ గా ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధి బారిన పడాల్సిన బాధ నుంచి తప్పించుకోవచ్చు. ఆహార నియమాలు, వ్యాయామాల ద్వారానే డయాబెటిక్ రాకుండా అడ్డుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ దశలో కొన్ని రకాల లక్షణాలను శరీరం బయటపెడుతుంది. వాటిని గమనించి షుగర్ టెస్టు చేయించుకోవాలి. అందులో వచ్చే ఫలితాన్ని బట్టి మీరు ప్రీ డయాబెటిక్ కాదో వైద్యులే చెబుతారు. మీరు కూడా తెలుసుకోవచ్చు.
ప్రీ డయాబెటిక్ అయిన వారిలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. చెవుల నుంచి కాళ్ల వరకు వివిధ ప్రదేశాలలో దద్ధుర్లు వస్తుంటాయి. ఆ దద్దర్లు కూడా రకరకాలుగా ఉంటాయి.
డిజిటల్ స్క్లెరోసిస్ (Digital sclerosis)
చర్మం గట్టిపడినట్టు అవుతుంది. చేతుల వెనుక భాగంలో మందంగా మారుతుంది. ఇది తరచూ టైప్ 1 డయాబెటిస్ రోగులలో కనిపిస్తుంది.
డయాబెటిస్ డెర్మోపతి (Diabetes dermopathy)
చర్మం పొలుసుల మాదిరిగా మారుతుంది. లేత గోధుమ రంగు మచ్చలు వస్తాయి.
నెక్రోబయోసిస్ లిపోయిడికా డయాబెటికోరమ్
(Necrobiosis lipoidica diabeticorum)
కాలు కింద భాగంలో దద్దుర్లు వస్తాయి. ప్యాచెస్ లాంటి ఎర్రని మచ్చలతో మధ్యలో పసుపు రంగులో ఉంటాయివి. ఇవి అధికంగా మహిళల్లో కనిపిస్తాయి.
డయాబెటిస్ ఫుట్ సిండ్రోమ్ (Diabetes Foot Syndrome)
చర్మానికి గాయం అయ్యాక అది తగ్గకుండా పెద్దగా మారడం.
బులోసిస్ డయాబెటికోరం (Bullosis diabeticorum)
డయాబెటిక్ న్యూరోపతి ఉన్న రోగులలో అధికంగా చేతులు, పాదాలు, కాళ్లు, ముంజేతుల నొప్పి, వాటిపై పొక్కులు వస్తుంటాయి.
దద్దుర్లు కాకుండా ప్రీ డయాబెటిస్ ముఖ్య లక్షణాలు మరికొన్ని ఉన్నాయి. మోచేతులు, మోకాలు, చంకలు, పిడికిలి, మెడ వంటి ప్రాంతాల్లో చర్మం రంగు మారడం వంటివి కూడా డయాబెటిస్ రావడానికి ముందు సంకేతం. అలాగే...
1. చూపు మసకగా మారడం
2. ఆయాసం
3. దాహం అతిగా వేయడం
4. తరచూ మూత్రానికి పోవడం ముఖ్యంగా రాత్రిళ్లు
5. చిన్న దెబ్బ తగిలినా అది త్వరగా తగ్గక పోవడం
ఈ లక్షణాలు కనిపించినా తేలికగా తీసుకోకండి. ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ రోగులలో ముందస్తు లక్షణాలు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: షాకింగ్ అధ్యయనం... పారాసెటమాల్ మాత్రలతో గుండె పోటు వచ్చే ఛాన్సులు పెరుగుతాయి
Also read: మీరు వాడే సబ్బులో ఈ రసాయనాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి, వీటితో చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం