అసలే వర్షాలు ఆపై దోమలు. చల్లని వాతావరణంలో దోమలు తమ సంఖ్యను పెంచుకుంటాయి.  దోమల నుంచి రక్షణ పొందడానికి అనేక మార్గాలు వెతుకుతూనే ఉంటారు. దోమల నివారణ మందులు, నెట్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. దోమ కాటు నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని మొక్కలు రక్షణగా నిలుస్తాయి. ఈ మొక్కలు మీ ఇంట్లో పెంచుకున్నారంటే దోమలు పరార్. కొన్ని ఇండోర్ మొక్కలు మనకు అనేక విధాలుగా సహాయపడతాయి. హానికారకమైన కాలుష్య కారకాలని ఫిల్టర్ చేస్తాయి. తాజా ఆక్సిజన్‌ను అందిస్తాయి. దోమలని ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. మీ ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే దోమలకు నచ్చని ఈ మొక్కలను పెంచుకుని చూడండి.


పుదీనా


పుదీనా ఆకుల వాసన కాస్త ఘాటుగా ఉంటుంది. వాటికి దోమలని తిప్పికొట్టే గుణం ఉంటుంది. మొక్క నుంచి వచ్చే ఘాటైన వాసన కీటకాలను దూరం చేస్తాయి. ఈ మొక్కలు చాలా సులభంగా పెరుగుతాయి. కొంచెం చోటు ఉన్నా సరే అల్లుకుపోతుంది. పుదీనా ఆకుల్లో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దాని పోషకాలని పొందటం కోసం వంటలు లేదా టీలో వేసుకుని ఉపయోగించుకోవచ్చు.


వెల్లుల్లి


వెల్లుల్లిలో చాలా పోషక విలువలు ఉంటాయి. దాని ఘాటైన వాసన వల్ల దోమలు ఇంట్లోకి రావు. దోమకాటు నివారించడానికి వెల్లుల్లి రసాన్ని మీ శరీరంపై అప్లై చేసుకోవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దోమల మీద చాలా ప్రభావవంతమగా పని చేస్తాయి.


లావెండర్


కీటకాలు, ఈగలు, దోమలు, చీమలని నియంత్రించడంలో సహాయపడే నాన్ టాక్సిక్ సమ్మేళనం లావెండర్ లీనాలూల్ లో ఉంటుంది. లావెండర్ మొక్క దోమ కాటుని నియంత్రిస్తుంది. మానసిక స్థితిని పెంచడానికి ఆహ్లాదకరమైన వాసన ఇస్తుంది. స్వచ్చమైన గాలిని విడుదల చేస్తుంది. ఇంట్లో లావెండర్ మొక్క ఉంటే ఒత్తిడి, ఆందోళన, నిరాశ దూరం అవుతాయి. మీ మనసుని రిలాక్స్ చేస్తుంది.


బంతిపువ్వు(మేరీగోల్డ్ ప్లాంట్)


బంతిపువ్వు దోమలని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇది తేలికపాటి సువాసన వెదజల్లుతుంది. పసుపు రంగులో అందంగా కనిపిస్తుంది. మస్కిటో రిపెల్లెంట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గాయాలను నయం చేస్తాయి.


తులసి మొక్క


ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండే మొక్క తులసి. దాని శక్తివంతమైన వాసనతో దోమలను చాలా సులభంగా తరిమికొట్టే సామర్థ్యం దీనిలో ఉంటుంది. ఇందులోని ఔషధ గుణాలు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే శుభప్రదంగా పూజిస్తారు. దీని గాలి పీల్చడం వల్ల అనేక వ్యాధులని నయం చేయవచ్చు. ఫ్లూ వ్యాధులని దూరంగా ఉంచుతుంది. తులసి ఆకులని వేడి నీళ్ళలో వేసి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.


రోజ్మేరీ


రోజ్మేరీ అనేక వంటలలో చాలా ప్రసిద్ధ మూలికలలో ఉపయోగించబడుతుంది. ఇది ఉత్తమ దోమల వికర్షక మొక్క. డిని బలమైన వాసన దోమలు, ఈగలని నిరోధిస్తుంది. ఈ మొక్క చర్మ వ్యాధులకి చికిత్స చేస్తుంది. జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది.


సిట్రోనెల్లా


ఇది గాలిలోని హానికరమైన టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేస్తుంది, మంచి సువాసన ఉంటుంది. ఈ మొక్కలోని యాంటీ ఫంగల, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఆరోగ్య సమస్యలకి చికిత్స చేస్తాయి. దోమలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: నవంబరులో పుట్టిన పిల్లలకి పట్టిందల్లా బంగారమే!