మీరు నవంబరు నెలలో పుట్టారా? అయితే అదృష్ట జాతకులేనండోయ్. ఇతరులతో పోలిస్తే నవంబర్ లో జన్మించిన వాళ్ళు భిన్నమైన లక్షణాలు కలిగి ఉంటారట. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటుడు షారూఖ్ ఖాన్ తో పాటు ఎంతోమంది ఇతర ప్రముఖులు ఈ నెలలోనే జన్మించారు. ఈ నెలలో పుట్టిన వాళ్ళు రెండు రాశుల కిందకి వస్తారు. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 మధ్య జన్మించిన పిల్లలు వృశ్చిక రాశి కిందకి వస్తే మిగతా వాళ్ళు ధనస్సు రాశి కిందకి వస్తారు.


క్రీడలంటే అభిరుచి


నవంబరు నెలలో జన్మించిన పిల్లలు ఎక్కువగా క్రీడలు ఆడేందుకు ఇష్టపడతారంట. సాహసాలు చేసే అభిరుచి కలిగి ఉంటారు. అంతే కాదు ఫిట్‌నెస్ మీద విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు. అందుకే ఈ నెలలో పిల్లలు ఎక్కువగా క్రీడలు తమ అభిరుచిగా ఎంపిక చేసుకుంటున్నారు. క్రికెట్, ఫుట్ బాల్ ఇలా ఏదైనా ఆటలో మీ పిల్లలు ఆసక్తిగా ఉంటే వారిని వెన్నంటే ఉండి ప్రోత్సహించండి. వాటినే వృత్తిగా ఎంచుకోవాలని అనుకుంటే అభినందించి ముందుకు నడిచే విధంగా సహాయం చెయ్యండి.


ఆరోగ్యం సూపర్


ఈ నెలలో జన్మించిన వాళ్ళు ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారు. ఫిట్ నెస్ మీద వారికి చాలా శ్రద్ధ ఉంటుంది. మాటపరంగా కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు అనుసరిస్తారు. అందుకే ఎప్పుడు వాళ్ళు తమ వెంట శానిటైజర్ తీసుకుని వెళ్తుంటే మీరేమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది వారి ఆరోగ్యం మీద వాళ్ళకి ఉన్న శ్రద్ధ అని మురిసిపోండి.


విధేయతగా ఉంటారు


నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా విధేయత కలిగి ఉంటారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా కూడా మీకు చాలా నమ్మకంగా ఉంటారట. ఎంతటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ మీకు సహాయం చేసేందుకు వెనుకాడరు. అందుకే ఈ నెలలో పుట్టిన వాళ్ళ విధేయతని అనుమానించకూడదు. మీకు ఎప్పుడు అండగా తోడుగా ఉండేందుకు ఎటువంటి సాహసం అయిన చేసేందుకు సిద్ధంగా ఉంటారు.


అందంగా కనిపించడం అదనపు లక్షణమే


నిజానికి అందం అంటే బాహ్య సౌందర్యం కాదు. వారి ప్రవర్తన, గుణగణాలు కూడా అందం కిందకే వస్తాయి. ఈ నెలలో పుట్టిన వాళ్ళు అందంగా కనిపిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మంచి మనసుతో మేలు చేసే పనులు చేసే వాళ్ళు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. అది కూడా వాళ్ళకి అందమే. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళే సెంటర్ ఫర్ ఎట్రాక్షన్ గా మారిపోతారు. అందరి దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది.


నియమాలు నిక్కచ్చిగా పాటిస్తారు


నవంబరులో జన్మించిన వ్యక్తులు ఎప్పుడు నిబంధనలు ఉల్లంఘించరు. నియమ నిబంధనల పట్ల చాలా నిక్కచ్చిగా ఉంటారు. వాటికి కట్టుబడి ఉంటారు. ఈ లక్షణం చాలా ప్రశంసించదగినది. కానీ దీని వల్ల కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అతి మంచితనం కూడా పనికిరాదని అంటారు. నిజాయితీగా ఉంటూ మరొకరికి ఆదర్శవంతంగా నిలబడతారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: పాలు తాగకపోతే ఏమవుతుంది? పోషకాహార నిపుణులు ఏం సూచిస్తున్నారు?