ప్రతీ జీవి వయసు పెరుగుతున్న కొద్దీ ముసలితనం వస్తుంది. కానీ మనిషి కొన్ని ఆహారాలు తినడం వల్ల త్వరగా ముసలితనాన్ని కొనితెచ్చుకుంటున్నాడు. నలభై ఏళ్లకే యాభై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఎవరైతే కొన్నిరకాల ఆహారాలు అధికంగా తింటారో వారు త్వరగా ముసలి వాళ్లు అవ్వడం ఖాయం అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. ఏ ఆహారం చాలా వేగంగా వృద్ధాప్య సంకేతాలను చూపుతుందో తెలుసుకోవడానికి ఈ కథనం సహకరిస్తుంది.


ఆల్కహాల్  
అధికంగా మద్యపానానికి మీరు బానిసలైతే శరీరం నిర్జలీకరణం కావడం మొదలవుతుంది. దీని వల్ల చర్మంపై గీతలు, ముడతలు పడతాయి. శరీరంలో నీరు తగ్గిన తర్వాత మన చర్మం ఇలాంటి వృద్ధాప్య లక్షణాలను చూపించడం ప్రారంభిస్తుంది. ఆల్కహాల్ మన శరీరంలోని ముఖ్యమైన పోషకాలను కరిగించి కణాల పునరుత్పత్తిని ఆపుతుంది. కాబట్టి ఆల్కహాల్ వల్ల మీరు వయసు ఎక్కువగా కనిపిస్తారు. 


తీయని పానీయాలు
అకాల వృద్ధాప్యం బారిన పడేసే ఆహారాలలో  పంచదార కలిపిన కాక్ టెయిల్స్, పానీయాలు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. చక్కెర చర్మంలోని కొల్లాజెన్‌ను నాశనం చేస్తుంది. డీహైడ్రేషన్‌ వల్ల చర్మంపై గీతలు, ముడతలు పడతాయి.


సాల్టీ ఫుడ్స్  
ఉప్పులో ఉండే అయోడిన్ ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి చాలా అవసరం. అయితే అధికంగా ఉప్పుత తింటే మాత్రం చాలా ప్రమాదకరం.వంట చేసేటప్పుడు వేసే ఉప్పు తప్ప పచ్చి ఉప్పును ఆహారాలపై చల్లకుని తినడం మానేయాలి. శరీరంలో ఉప్పు అధికంగా చేరడం వల్ల డీ హైడ్రేషన్ కలుగుతుంది. దీంతో చర్మం పాడైపోతుంది. 


ప్రాసెస్ చేసిన మాంసాలు 
ప్రాసెస్ చేసిన మాంసాహారాలు బయట అమ్ముతున్నారు. వాటికి ప్రిజర్వేటివ్స్ జోడిస్తారు. ఇవి అనారోగ్యకరమైనవి. అంతేకాదు ప్రాసెస్ చేయడానికి అధికంగా ఉప్పు వాడతారు. ఈ మాంసాన్ని తిన్నప్పుడు శరీరంలో ఇన్ఫ్లమ్మేషన్ వస్తుంది. దీర్ఘకాలం పాటూ ఇలాంటి మాంసాన్ని తినడం వల్ల శరీరం త్వరగా నీరసపడి వృద్ధాప్యం వచ్చేస్తుంది. 


డీప్-ఫ్రైడ్ ఫుడ్స్ 
నూనెలో బాగా వేయించిన ఆహారాలు అధిక కేలరీలతో పాటూ కొవ్వును కలిగి ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహానికి కారణం అవుతాయి. మొటిమల సమస్యను కూడా పెంచుతుంది. చర్మం పొడిబారినట్టు మారుతుంది. ఫాస్ట్ ఫుడ్‌లలో అధికంగా వేయించిన ఆహారాన్ని అమ్ముతారు. వాటిని తినడం తగ్గించాలి. 


స్పైసీ ఫుడ్స్ 
కారంగా ఉండే ఆహారాన్ని తినే వాళ్లు ఎంతోమంది. రుచి కోసం చూసుకుంటే చర్మం పాడవుతుంది. చర్మంపై ఎర్రని దద్దుర్లు, మచ్చలు వచ్చేస్తాయి. చర్మం నిర్జీవంగా మారుతుంది. 40 ఏళ్లు దాటిన వ్యక్తులు యవ్వనంగా కనిపించాంటే పైన చెప్పిన ఆహారాలన్నీ దూరం పెట్టాలి. 


Also read: యాభై శాతం భారతీయ ఉద్యోగులు ఇందుకే రాజీనామా చేస్తున్నారు, సర్వేలో షాకింగ్ విషయాలు


Also read: ఈ ఎర్రని పండ్ల రసం సహజంగా నిద్రలేమిని అంతం చేస్తుంది, మందులు అవసరమే ఉండదు



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.