చాలామంది కాకరకాయ పేరు చెప్పగానే ముఖం అదోలా పెడతారు. కాకరకాయతో చేసిన ఏ వంటకాన్ని తినడానికి ఇష్టపడరు. కానీ అది చేసే మేలు ఇతర ఏ కూరగాయ చేయదు. మన శరీరంలోని దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే శక్తి కాకరకాయకు ఉంది. కాకర రసం తాగితే ఎంతో ఆరోగ్యం. అలాగే కాకరకాయతో పులుసు చేసుకొని తిన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగంతో బాధపడేవారు కాకరకాయకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు కాకరకాయతో చేసిన వంటకాలను తినాలి. ముఖ్యంగా ప్రతిరోజు కాకరకాయ రసాన్ని తాగితే ఎంతటి మధుమేహం అయినా అదుపులోకి వచ్చేస్తుంది.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండడం వల్లే మధుమేహం వచ్చిందని చెబుతారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టే ఆహారాన్ని ఎంచుకొని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఈ గుణం కాకరకాయలో అధికం. వీటిల్లో చెరాటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కలిసి చక్కెర పెరగకుండా అడ్డుకుంటుంది. ఎన్నో అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రక్తంలోని చక్కెర, గ్లూకోజ్‌ను.. జీవక్రియలో భాగం చేస్తుంది. అవి జీవక్రియలో పాల్గొన్నప్పుడు గైకోజన్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఈ గైకోజన్ కాలేయంలోనే నిల్వ ఉంటుంది. ఇది శక్తి విడుదలయ్యేలా చేస్తుంది. ఈ గైకోజన్ విడుదల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో పెరగకుండా ఉంటాయి.
కాకరకాయలో మరెన్నో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సీ భారీగా ఉంటాయి. ఆరోగ్యపరమైన కొవ్వులు, ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి కాకరకాయను ఎవరు తిన్నా ఆరోగ్యమే. దాని రుచి అంతగా బాగోదు. రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి కాకరను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ప్రతిరోజూ చిన్న గ్లాస్ తో కాకరకాయ రసాన్ని తాగితే మధుమేహ రోగులు ఉపశమనం పొందుతారు. ఎంతటి మధుమేహం అయినా ఈ రసం తాగడం వల్ల అదుపులోకి వచ్చేస్తుంది. రెండు వారాలు తాగి చూడండి. మీకే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అదుపులో ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కాబట్టి రోజుకు చిన్న గ్లాస్ తో కాకరకాయ రసం తాగడం అలవాటు చేసుకోండి. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు అంటే షుగర్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు మాత్రం పరగడుపున ఖాళీ పొట్టతో కాకరకాయ రసాన్ని తీసుకోకపోవడం మంచిది. ఇది మరింతగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల నీరసంగా అనిపించవచ్చు. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు మాత్రమే కాకరకాయ రసాన్ని ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
Also read: గుండె కోసం అప్పుడప్పుడు చెర్రీ టమోటోలను తినండి
Also read: ఇంట్లో ఆస్తమా రోగులు ఉన్నారా? అయితే వీటికి గుడ్ బై చెప్పండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.