చాలా మందికి ఉదయం తినే అల్పాహారం అంటే చాలా చిన్నచూపు. టీ లేదా కాఫీ తాగేసి ఉండిపోతారు. నేరుగా లంచ్‌లో గట్టిగా లాగించేద్దాంలే అనుకుంటారు. అదే ఆరోగ్యపరంగా వారు చేస్తున్న పెద్ద తప్పిదం. ఉదయాన తిండి  తినడం మానేస్తే సన్నబడతాం అని భావించేవాళ్లు అధికమే. కానీ బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఇంకా బరువు పెరుగుతారు కానీ తగ్గరు. కొన్ని అధ్యయనాల ప్రకారం బ్రేక్ ఫాస్ట్ చేయనివారు త్వరగా ఊబకాయం బారిన పడుతున్నారు. అధిక బరువుతో బాధపడేవాళ్లలో మధుమేహం ముప్పు అధికం. వీరు త్వరగా డయాబెటిస్ బారిన పడతారు. చూశారా... బ్రేక్ ఫాస్ట్ మానేస్తే ఎన్ని సమస్యలు గొలుసులా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో. బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల  మీ శరీరంలో జరిగే మార్పులు ఇంకా ఉన్నాయి. 


1. ఉదయాన బ్రేక్ ఫాస్ట్ తినడకపోవడం వల్ల లంచ్ లో అతిగా లాగిస్తారు. దీనివల్ల అరుగుదల సమస్య వస్తుంది. అంతేకాదు అతిగా తిన్న ఆహారం కొవ్వుగా పేరుకుపోతుంది. రక్తంలో గ్లూకోజు లెవెల్స్ కూడా అతిగా పెరిగిపోతాయి.
2. బ్రేక్ ఫాస్ట్ తినకపోతే తీపి తినాలన్న కోరిక పెరిగిపోతుంది. చాక్లెట్లు, స్వీట్ల కోసం వెంపర్లాడుతారు. వాటిని అధికంగా తినేస్తారు. దీనివల్ల కూడా బరువు పెరుగుతారు.తద్వారా డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. 


ఏం తినాలి?
బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటే రోజంతా ఉత్సాహంగా గడుస్తుందో తెలుసుకుందాం. ఉదయం లేచిన రెండు మూడు గంటల్లోపే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొట్టలో వేయాలి. ఇలా తింటే రోజంతా ఉల్లాసంగా,శక్తివంతంగా ఉంటారు. ఉదయానే ఆహారం తినడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. దీనివల్ల మీరు బరువు తగ్గొచ్చు. ఉదయపు బ్రేక్ ఫాస్ట్ లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, మాంసం, చేపలు, నట్స్ వంటివి భాగం చేసుకోవాలి. ఇవన్నీ ఆరోగ్యకరమే. డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి. ఇక మధుమేహురోగులు ఆ రోగాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. వైట్ బ్రెడ్ తినేవాళ్లు అధికంగ ఉన్నారు. దాని బదులు మల్టీగ్రెయిన్స్ తో తయారుచేసిన బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ తినడం మంచిది. వాటిని జామ్, బట్టర్ కన్నా పీనట్ బటర్ తో తినడం మేలు. పప్పులతో వండుకునే గారెల్లాంటివి కూడా మంచివే. ఒకే పప్పు కాకుండా రెండు మూడు రకాల పప్పులు కలిపి చేసుకుంటే మరీ బలం. ఓట్స్, రాగి జావ లాంటివి ఇంకా బలన్నిస్తాయి. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. 


ఇవి వద్దు...
బయట ఇన్ స్టెంట్ బ్రేక్ ఫాస్ట్ లు దొరుకుతాయి. అలాగే  నూడిల్స్, పాస్తా, కార్న్ ఫ్లేక్స్ ఇలాంటివి కూడా అల్పాహారంలో తింటుంటారు చాలా మంది. ఇవన్నీ ప్రాసెస్ట్ ఫుడ్ కిందకి వస్తాయి. వీటిని తిన్నా సమస్యలే. మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది. బరువు కూడా నియంత్రణలో ఉండదు. కాబట్టి ఇలాంటివి బ్రేక్ ఫాస్ట్‌లో తినడం మానేయాలి


Also read: మీ జీవితంలో ప్రేమ నిండాలంటే మీ ఇంట్లో ఈ మొక్కలు ఉండాల్సిందే


Also read: జీవరసాయన ఆయుధాలు అంటే ఏమిటి? పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? మనుషులను సైలెంట్‌గా ఎలా చంపుతాయి?


Also read: మగవారికి ఈ అయిదు అలవాట్లు ఉంటే ఆ పవర్ తగ్గిపోతుంది, వదిలించుకుంటే మేలు