జీవితంలో ప్రేమ లోపిస్తే...ఎంతున్నా, ఏమున్నా కూడా అంతా శూన్యంగానే ఉంటుంది. ప్రేమ నిండిన మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందని ఎంతోమంది మనస్తత్వవేత్తలు చెప్పారు. జీవితంలోని సమస్యలకు జ్యోతిష్యశాస్త్రంలో పరిష్కారాలు ఉన్నట్టే, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా ఉన్నాయి. కొన్ని రకాల రాళ్లు, మొక్కలు చాలా పవర్ ఫుల్ శక్తులను కలిగి ఉంటాయని చెబుతారు. ప్రేమను, అదృష్టాన్ని ఇవి ఆకర్షిస్తాయని అంటారు. ప్రస్తుతం మనం ప్రేమ గురించే మాట్లాడుకుందాం. మీ జీవితంలో ప్రేమ లోపించినా, లేక ప్రేమ జీవితంలో సమస్యలుగా ఉన్నా కూడా ఇంట్లో ఈ మొక్కలను శ్రద్ధగా పెంచండి. అవి మీ జీవితంలో ప్రేమను నింపేస్తాయి.


తులసి 
ఈ మొక్కను దేవతగా తెలుగిళ్లల్లో పూజిస్తారు. ఇది ప్రేమ, సంపద, అందం, అదృష్టం... తదితరాలను ఇంటివైపు ఆకర్షిస్తుందట. ఆహారంలో కూడా తులసి ఆకులను వేసి వండుకుంటే ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. వంటకం రుచిని పెంచడమే కాదు, మనలోని ఆనందాన్ని కూడా తట్టి లేపుతుంది. ఇది మంచి యాంటి సెప్టిక్, యాంటి డిప్రెసెంట్ గుణాలు కలది. 


మల్లె 
మల్లె మొక్క ఇంటి ఆవరణలో ఉంటే చాలా మంచిది. ఆ మల్లె గుభాళింపు మీ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. మీ మూడ్ ను రిఫ్రెష్ చేస్తుంది. అలాగే ప్రేమభావనలను పెంచుతుంది. కామోద్దీపన కలిగించడంలో దీని వాసనదే మొదటి స్థానం. ఒంటరివారు మల్లె మొక్కను పెంచుకుంటే త్వరగా జంటవుతారనే నమ్మకం కూడా కొన్ని దేశాల ప్రజల్లో ఉంది. 


చిన్న గులాబీలు
గుత్తులుగా పూసే చిన్న గులాబీలు ఇంటి బాల్కనీలోనో, పెరట్లనే పెంచుకుంటే చాలా ఉపయోగం. ఇవి ప్రేమను,  అదృష్టాన్ని ఆకర్షిస్తాయి. ఎర్రగులాబీలు పెంచుకుంటే వాటిని చూసినప్పుడల్లా మీలో ప్రేమ భావనలు, కోరికలు పెరుగుతాయి. ఇవి లోతైన, నిజమైన ప్రేమకు సంకేతాలు. వీటిని పెంచుకుంటే మీ ప్రేమ జీవితంలో మంచి మార్పులు రావడం ఖాయం. 


ఆర్కిడ్లు
ఈ మొక్కలను ఇంట్లో పెంచడం కాస్త కష్టమైన పనే, కానీ ప్రయత్నించొచ్చు. అవి ఇంట్లో ప్రశాంతతను పెంచుతాయి. స్నేహాలను బలోపేతం చేస్తాయి. ఈ పూలను సంతానోత్పత్తికి, పురుషత్వానికి చిహ్నంగా చెబుతారు. కాబట్టి ఇవి ఉన్న ఇంట్లో ప్రేమ వర్థిల్లుతుంది. 


ఫ్లెమింగో పువ్వులు
వీటినే ఆంథూరియమ్ అని కూడా పిలుస్తారు. ఇవి గుండె ఆకారంలో పుష్పిస్తాయి. మీరు వాటిని జాగ్రత్తగా ఇంటి బాల్కనీలో పెంచుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మీ ప్రేమ జీవితం, బంధం అంత బలంగా ఉంటుంది. 


Also read: జీవరసాయన ఆయుధాలు అంటే ఏమిటి? పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? మనుషులను సైలెంట్‌గా ఎలా చంపుతాయి?


Also read: మగవారికి ఈ అయిదు అలవాట్లు ఉంటే ఆ పవర్ తగ్గిపోతుంది, వదిలించుకుంటే మేలు


Also read: రోజూ రెడ్ వైన్‌ తాగితే డయాబెటిస్ ముప్పును తగ్గించుకోవచ్చు, అందంగానూ మారొచ్చు