పీకూ సినిమాలో ఒక సందర్భంలో దీపిక పాడుకోన్ క్యారెక్టర్ ఒక మాట చెబుతుంది. ’’కొన్ని సంవత్సరాలు గడిచాక పేరెంట్స్ వాళ్లంతట వాళ్లు బతకలేరు. వాళ్లను మనమే బతికించుకోవాల్సి ఉంటుంది’’ అని. అటువంటి బాధ్యతను కొడుకుల కంటే కూతుళ్లే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొత్త అధ్యయనాలు రుజువులతో నిర్ధారిస్తున్నాయి.


తమకు కొడుకే పుట్టాలని దాదాపు ప్రతీ జంట కలలు కంటారు. కనీసం ఒక్క కొడుకైనా ఉంటే చాలు అనుకుంటారు. వంశాంకురమని ముద్దు చేస్తారు. వార్థక్యంలో శ్రద్ధగా చూసుకుంటాడని ఆశలు పెట్టుకుంటారు. కానీ నిజాలు అలా లేవని నిపుణులు అంటున్నారు. ఆడపిల్లలను కన్న పేరెంట్స్ కంటే మగపిల్లలను కన్న పేరేంట్స్ త్వరగా వార్థక్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. అదెందుకో ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.


వయసు పైబడే కొద్ది డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు మొదలవుతూనే ఉంటాయి. ఈ సమస్యలకు నిజానికి పెద్దగా చికిత్సలు అందుబాటులో లేవు. పరిస్థితి మరింత దిగజారకుండా మందులు ఇవ్వడం మినహా. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవడం కోసం చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇంకా శాస్త్రవేత్తలు ఇదే సరైన సమాధానం అని చెప్పలేకపోతున్నారు.


జర్నల్ ఆఫ్ సైకియాట్రిక్ రీసెర్చ్ అనే జర్నల్ లో కొత్త ఫలితాలను చర్చించారు. ఇందులో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల కంటే మగ పిల్లలను కన్న తల్లిదండ్రుల్లో ఏజింగ్ ప్రాసెస్ వేగంగా జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఆడపిల్లలు తల్లిదండ్రుల పట్ల తీసుకునే శ్రద్ధ మగ పిల్లల కంటే సమర్థవంతంగా ఉండడం కూడా ఒక కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఈ అధ్యయనం కోసం 18 సంవత్సరాలుగా 13 వేల 2 వందల 22 మంది 50 సంవత్సరాలు పైబడిన పేరెంట్స్ ను ఎంపిక చేశారు. వీరికి కొన్ని మాథ్స్ ప్రాబ్లెమ్స్ ఇచ్చి సాధించమన్నారు. కొన్ని పదాలు చెప్పి గుర్తుంచుకోవాల్సిందిగా కోరారు. ఈ అధ్యయనం మొదలైన కొత్తల్లో మగపిల్లల పేరెంట్స్ కి, ఆడ పిల్లల పేరేంట్స్ కి పెద్ద తేడా కనిపించలేదు. కానీ నెమ్మదిగా సంవత్సరాలు గడిచే కొద్దీ మగ పిల్లల తల్లిదండ్రుల ఇంటలిజెన్స్ లో మార్పులు రావడం గమనించారు. ఒక్క కొడుకు ఉన్న పేరేంట్స్ లో చాలా మార్పులు గమనించామని న్యూయార్క్ కు చెందిన కొలంబియా యూనివర్సిటి నిపుణులు అంటున్నారు. ఈ మార్పులు బయోలాజికల్ కంటే కూడా సోషల్ కారణాల వల్లే అని అధ్యయనాలు చెబుతున్నాయి.


మానసికంగా కూతురు ఇచ్చే సపోర్ట్.. కొడుకు ఇచ్చేదాని కంటే ఎక్కువగా ఉంటుందట. అది వారికి ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా డిప్రెషన్ లో ఉన్నపుడు. డిప్రెషన్ ఒక వయస్సు తర్వాత బ్రెయిన్ ఫంక్షన్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో వారికి ఒక తోడు, వారికి ఒక మానసిక అండ ఉన్నదన్న భావన ఇలాంటి నష్టం జరగకుండా కాపాడుతుంది. ఫలితంగా వారి మానసిక సామర్థ్యం అంత త్వరగా తగ్గుముఖం పట్టడం లేదనేది నిపుణుల అభిప్రాయం.


ఎందుకు డిమెన్షియా వయసు కంటే ముందుగా మొదలవుతుంది?


డిమెన్షియా అనేది  సోషల్, థింకింగ్ డిజార్డర్ గా చెప్పుకోవచ్చు. ఇది కొన్ని రకాల సమస్యలతో కలిసి ఏర్పడేది. ఇందులో భాగంగా జ్ఞాపకశక్తి సన్నగిల్లలడం, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేక పోవడం వంటివి మాత్రమే కాదు.. రోజువారి చేసుకునే చాలా పనుల్లో అంతరాయాలు రావచ్చు. ఈ సమస్యలకు నిజానికి సరైన చికిత్స అందుబాటులో లేదు. సమస్య మొదలైన కొత్తల్లో మెడిటేషన్ తోపాటు కొన్ని థెరపీలతో మరింత విషమించకుండా మేనేజ్ చెయ్యవచ్చు.


డిమెన్షియా లక్షణాలు


⦿ జ్ఞాపకశక్తి సన్నగిల్లడం


⦿ సోషల్ బిహేవియర్ లో మార్పులు


⦿ ఏకాగ్రత లేకపోవడం


⦿ లోన్లీనెస్


⦿ యాంక్జైటీ


⦿ నెర్వస్నెస్


⦿ డిప్రెషన్


⦿ కొంత మందిలో భ్రమలు (Hallucination) కూడా కలుగవచ్చు


⦿ చికాకు, విసుగు


⦿ నిద్రలేమి


⦿ సంబంధం లేకుండా మాట్లాడడం


⦿ నడకలో నిలకడం లేనితనం