మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. ఇది వ్యర్థాలను బయటకు పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఆహారంలోని పోషకాలను గ్రహించి తిరిగి శరీరానికి అందిస్తుంది. విషపదార్థాల ప్రవేశాన్ని అడ్డుకుని శరీరాన్ని కాపాడుతుంది లివర్. అందుకే దీన్ని మన శరీరానికి ‘చెక్ పోస్టు’ అని చెప్పుకోవచ్చు. కాలేయ క్యాన్సర్, పచ్చకామెర్లు, ఫ్యాటీ లివర్ ఇలా కొన్ని ప్రాణాంతక వ్యాధులు కాలేయానికి వచ్చే అవకాశం ఉంది. వాటిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాలేయ సమస్యలు ఉన్నవారిలో కాళ్లు, పాదాలపై కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. 


ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త...
1. పాదాలు లేదా మోకాలి వెనుక వైపు ఎర్రని చారల్లా రక్తనాళాలు బయటికొచ్చి కనిపిస్తే తేలికగా తీసుకోకండి. ఆ రక్తనాళాలు అల్లుకున్న సాలెగూడులా కనిపిస్తుంటే వెంటనే వైద్యుని వద్దకు చెకప్ వెళ్లాలి. అలా కనిపించడం వెనుక లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ అనే కాలేయ సమస్య ఉండవచ్చు. 
2. పాదాలపై ఎర్రని మచ్చలు కనిపిస్తున్నా కూడా చాలా మంది పట్టించుకోరు. దోమలు కుడితే ఎలా ఎర్రెర్రగా మారుతాయో అలాంటివి వచ్చాయంటే కాలేయం ఏదో ప్రమాదంలో ఉన్నట్టు సూచన కావచ్చు. అలాగే పాదాలకు రక్త సరఫరా సరిగా కాకపోయినా కూడా ఇలా ఎర్రగా, గోధుమ రంగులో మచ్చలు కనిపించే అవకాశం ఉంది. వైద్యుడిని సంప్రదిస్తే కారణమేంటో తేలుస్తారు. ఒక కాలేయానికి సంబంధించినది అయితే ప్రాథమిక దశలోనే చికిత్స ఆరంభించే అవకాశం ఉంది. 
3. అరికాళ్లలో ఎలాంటి కారణం లేకుండా దురదగా, నొప్పిగా అనిపించడం కొన్ని రోజుల పాటూ వేధిస్తుంటే ఓసారి కాలేయ చెకప్ అవసరం. 
4. పాదాల్లో వాయడం, నీరు పట్టడం లాంటివి కూడా తేలికగా తీసుకోకూడదు. లివర్ సమస్యల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. 
5. కాలి వేళ్ల మధ్య ఇన్ ఫెక్షన్లు రావడం, తరచూ పాదాలపై ఫంగస్ చేరడం వంటివి కూడా కాలేయ ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి. పాదాల నుంచి దుర్వాసన వచ్చినా కూడా తేలికగా తీసుకోకండి.  
6. కాలి వేళ్ల గోర్లు మరీ తెల్లగా మారినా కూడా తేలికగా తీసుకోకండి. జింక్ లోపం వల్ల ఇలా అవుతాయి గోళ్లు. ఒకవేళ జింక్ లోపం కాకపోతే కాలేయ సమస్య కారణం కావచ్చు.
పైనున్న లక్షణాలు కనిపించినప్పుడు పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించడం మంచిది కాదు. ఒక్కోసారి ఈ లక్షణాలు తీవ్రమైన కాలేయ వ్యాధులతో ముడిపడి ఉంటాయి. 





గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.





Also read:  బాహుబలిని మించేలా ఐరన్ మ్యాన్ థాలి... తింటే రూ.8.50 లక్షలు మీ సొంతం


Also read: యాంటీ క్యాన్సర్ డ్రింక్‌గా దేశీ టీ, తయారీ విధానం ఇదిగో...