టీ అంటే మనదేశంలో ఎంతో మందికి ప్రాణం. రోజులో నాలుగైదుసార్లు టీ తాగకపోతే ఏదో లోటుగా అనిపిస్తుంది. కొంతమంది అయితే ఈ పానీయం తాగనిదే పని కూడా మొదలుపెట్టరు. టీలలో చాలా రకాలు ఉన్నాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీ, మిల్క్ టీ... చెప్పుకుంటూ పోతే బోలెడు. వీటిలో ఉండే సుగుణాలు మెదడు ఆరోగ్యం నుంచి గుండె ఆరోగ్యం వరకు కాపాడతాయి. టీకి క్యాన్సర్ నుంచి కాపాడే గుణాలను కూడా అందివ్వవచ్చు. అందుకు తయారీ పద్ధతిని మార్చాలి. కింద చెప్పినట్టు తయారుచేసుకుని రోజూ తాగితే క్యాన్సర్ రాకుండా అడ్డుకోగలదు. ఆధునిక జీవనంలో ఈ టీ తాగడం చాలా అవసరం కూడా. 


తయారీ విధానం...
నీళ్లు - అరకప్పు
నలుపు తేయాకులు - అర టీస్పూను
ఆకుపచ్చ తేయాకులు - ఒక టీస్పూను
పాలు - అయిదు టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీస్పూను
తులసి ఆకులు - అయిదు
దాల్చిన చెక్క పొడి - పావు టీస్పూను
అల్లం తురుము - అర టీస్పూను
రోజ్ మేరీ - రెండు రెబ్బలు
కుంకుమ పువ్వు - రెండు రేకలు
జీలకర్ర గింజలు - పావు టీస్పూను


యాంటీ క్యాన్సర్ టీ తయారుచేసేందుకు ముందుగా స్టవ్ పై గిన్నెతో నీళ్లు పెట్టి అందులో బ్లాక్ టీ ఆకులు వేయాలి. మరిగాక పాలు వేసి బాగా మళ్లీ మరిగించాలి. బాగా మరిగాక గ్రీన్ టీ ఆకులు వేయాలి. రెండు నిమిషాలు మరిగించాక మిగతా పదార్థాలన్నీ వేసేయాలి. అవన్నీ వేశాక ఎక్కువ సేపు మరిగించకూడదు. ఒక నిమిషంలోపలే స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు వడకట్టుకుని ఆ టీని వేడివేడిగా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మసాలా దినుసులు అన్నీ వేశాక అధికంగా మరిగిస్తే వాటిలో ఉంటే పోషకాలు నశిస్తాయి. కాబట్టి కొన్ని సెకన్లలోనే ఆపేయాలి. ఈ టీ మంచి సువాసన వస్తుంది. దీన్ని కొన్ని రోజుల పాటూ తాగితే మీకే ఆరోగ్యంలో తేడా తెలుస్తుంది. 


ఈ టీ తయారీకి మనం వాడిన మూలికలు, మసాలాలలో క్యాన్సర్ ను నిరోధించే గుణాలు ఉన్నాయి. పసుపు, కుంకుమ పువ్వు, రోజ్ మేరీ, అల్లం, దాల్చిన చెక్క, తులసి, జీలకర్ర వంటి వి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. వీటిని టీగానే కాదు ఆహారంలో కూడా ఏదో ఒక రూపంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. 





గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.





Also read: డ్రైఫ్రూట్స్ హల్వా... నిండుగా పోషకాలు, తింటే ఎంతో బలం