చంటి పిల్లలకు వాడే ప్రతి ఉత్పత్తిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని రకాల రసాయనాలు ఉండడం వల్ల వారికి చర్మ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్యచే అవకాశం ఉంది. అందుకే మహారాష్ట్రా ప్రభుత్వం జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ పై నిషేధం విధించింది. తాము చేసిన నాణ్యత తనిఖీలో ఆ ఉత్పత్తి విఫలమైందని లైసెన్స్ ను క్యాన్సిల్ చేసింది. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, జాన్సన్ బేబీ పౌడర్  pH విలువ అనుమతించదగిన స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. తనిఖీ కోసం జాన్సన్ సంస్థ వాళ్లు ఇచ్చిన నమూనా చాలా తక్కువ నాణ్యతను కలిగిఉన్నట్టు గుర్తించారు. ఇది చంటి పిల్లల చర్మఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని వారు తెలిపారు. అందుకే జాన్సన్ బేబీ పౌడర్ తయారీని తమ రాష్ట్రంలో నిషేధించారు. 


ఎలా తయారుచేస్తారు?
బేబీ పౌడర్‌లను పిల్లల చర్మ సంరక్షణ కోసం వాడతారు. వీటిని మట్టిలోని ఖనిజాలు, మొక్కజొన్న పిండి వంటి వాటితో తయారుచేస్తారు. కానీ కొన్ని రసాయనాలను అధికంగా కలుపుతున్నారు. అందుకే కొనేటప్పుడు ఎలాంటి రసాయనాలు లేని పౌడర్లు కొనాలి. కింద చెప్పిన రసాయనాలు ఉంటే కొనకూడదు. బేబీ పౌడర్ పై అతికించిన స్టిక్కర్లపై వాటిలో వాడిన రసాయనాలు కూడా రాస్తారు. వాటిలో కింద చెప్పినవి ఉంటే వాటిని వాడకపోవడమే మంచిది. 


బ్లీచ్: బ్లీచ్ ఉండడం వల్ల పిల్లల్లో కంటి చూపు సమస్యలు, గొంతు మంట, శ్వాస ఆడకపోవడం వంటివి కలుగుతాయి. ఇది చాలా రియాక్టివ్ పదార్థం. ఇది రసాయనాలతో కలిస్తే తీవ్రమైన ఆరోగ్య చిక్కులను కలిగిస్తుంది. 


సల్ఫేట్లు: SLS లేదా SLES వంటి సల్ఫేట్లను కలిగి ఉన్నపౌడర్లను పిల్లలకు రాయకూడదు. ఇవి సాధారణంగా మురికిని తొలగించడానికి ఉపయోగిస్తారు. కానీ వీటిని బేబీ పౌడర్లో కలిపితే దద్దుర్లు, ఎర్రగా మారడం, శిశువుల మృదువైన చర్మంపై ఇన్ఫెక్షన్లు వంటివి వస్తాయి. 


థాలేట్స్: ప్లాస్టిక్ బొమ్మలు, ఆహార ప్యాకేజింగ్ కవర్లు, టిన్ లలో దీన్ని వాడతారు. ఇది చాలా హానికరమైనవి. సెక్స్ హార్మోన్ల ఎదుగుదలను అడ్డుకుంటాయి. స్మెర్మ్ కౌంట్, పునరుత్పత్తి అవయవాల్లో వైకల్యం వంటి సమస్యలకు కారణం అవుతాయి.


ఆస్బెస్టాస్: బేబీ టాల్కమ్ పౌడర్లలో ఆస్బెస్టాస్ ను కూడా వాడుతుంటారు.  ఇవి శిశువు సున్నితమైన చర్మానికి హాని కలిగిస్తాయి.


పారాబెన్స్: ఈ రసాయనాలు తీవ్రమైన చర్మ సమస్యలను కలిగిస్తాయి. పునరుత్పత్తి అవయవాలు సమర్థవంతంగా ఎదగకుండా ఉండేలా చేస్తాయి. దీనివల్ల పెద్దయ్యాక పిల్లల్లో సంతానోత్పత్తి సమస్యలు కలుగుతాయి. పిల్లలు యుక్తవయసుకు వచ్చారు బరువుకు సంబంధించి సమస్యలు రావచ్చు. 


శిశువు చర్మాన్ని ఎలా రక్షించాలి?
హెల్త్‌లైన్ ప్రకారం, బేబీ పౌడర్‌ పిల్లలు పీల్చకుండా చూసుకోవాలి. లేకుంటే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల జననాంగాలపై నేరుగా రాయకూడదు. కళ్లలో కూడా పడకుండా చూసుకోవాలి. నేరుగా పౌడర్ ను పిల్లలపై చల్లకండి. ఒక వస్త్రంపై వేసి దాంతో పిల్లలకు రాయండి. 


Also read: వాడిన వంటనూనెను మళ్లీమళ్లీ ఉపయోగిస్తున్నారా? అయితే ఈ ప్రాణాంతక సమస్యలు ఎప్పుడైనా రావచ్చు



Also read: ఈ మొక్కల ఆకులను రోజుకు రెండు నమిలితే చాలు, డయాబెటిస్ పెరగదు




























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.