హా! ఏమి రుచి.. తినరా మై మరచి.. రోజూ తిన్నామరి మోజే తీరనిది.. స్విగ్గీ ఆర్డర్లలో రాజా ఎవరంటే..? ఇంకా చెప్పాలా? మన ఇడ్లీయేనండి..
ఇదేంటీ.. వంకాయ ఉండాల్సిన ప్లేస్‌లో ఇడ్లీ పెట్టేరేంటి? అనుకుంటున్నారా? అవునండి.. స్విగ్గీ ఆర్డర్లలో ఇడ్లీయే రాజానండి బాబూ.. అల్పాహారాల్లో ఇడ్లీకి ఉన్న క్రేజ్‌ అలాంటిదండి మరి..!


ఎందుకటే గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్లను ఆ సంస్థ పంపిణీ చేసింది. అల్పాహార ప్రియుల్లో ఆ ఇడ్లీకి ఉన్న క్రేజ్‌ ఎంతో తన నివేదికలో వివరించింది. అంతేకాదు.. ఈ సిగ్గీ ద్వారానే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అరుదైన రికార్డు సొంత చేసుకున్నాడు. ఆ విశేషాలంటో చదివేద్దామా?


ఇడ్లీ.. ఇడ్లీ.. ఇడ్లీ.. అవును! ఇడ్లీకి ఉన్న క్రేజే వేరు. పూర్వకాలం నుంచి అల్పాహారంగా దీనినే తీసుకుంటున్నారు. ఇడ్లీ లేని హోటలూ ఉండదు. బెంగళూరు వాసులు రవ్వ ఇడ్లీలు, చెన్నై వాసులు నెయ్యి, పొడి ఇడ్లీలు ఇష్టపడితే.. హైదరాబాద్‌ వాసులు కారం పొడి, నెయ్యి, చట్నీలతో కూడిన ఇడ్లీలు ఇష్టపడతారు. అందుకే ఈ ఇడ్లీలకు ఎక్కడైనా డిమాండ్‌ ఉంటుంది. వీటి ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 


ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ ద్వారా గత ఏడాది కాలంగా రూ.ఆరు లక్షలను కేవలం ఇడ్లీల కోసమే ఖర్చు చేశాడంట. ఇడ్లీలంటే తనకు ఎంత ఇష్టమో ఈ రికార్డు ద్వారా నిరూపించాడు. తన కోసమే కాదు.. తన కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం ఏడాది మొత్తంలో 8428 ప్లేట్ల ఇడ్లీలను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశాడు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. తాను ఎక్కడికి వెళితే అక్కడ స్విగ్గీలో ఆర్డర్‌ ఇచ్చేయడం ఈయనకు అలవాటు. 









కోల్‌కతా, కొచ్చి, ముంబై, కోయంబత్తూరు, పుణే, వైజాగ్, ఢిల్లీ నగరాలు నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు, ముంబై వాసులు డిన్నర్‌గా కూడా ఇడ్లీని ఎక్కువ ఇష్టపడుతున్నట్టు స్విగ్గీ తన సర్వేలో వెల్లడించింది. 


చాలా మంది రాత్రి పూట టిఫిన్‌చేసే వాళ్లు కూడా ఇడ్లీపైనే మక్కువ చూపిస్తున్నట్టు ఫుడ్‌ డెలవరీ సంస్థ స్విగ్గీ పేర్కొంది. అయితే అల్పాహార ఆర్డర్స్‌లో మసాలా దోశ మాత్రం ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటే, ఇడ్లీ దానిని అనుసరిస్తోంది.