విలువైన వస్తువులు వేలం పాటలో అమ్మేయడం గురించి తెలిసిందే. ముఖ్యంగా ప్రాచీన వస్తువులను సొంతం చేసుకోడానికి సంపన్నులు ఎంత మొత్తాన్ని చెల్లించేందుకైనా సిద్ధంగా ఉంటారు. వివిధ కళాఖండాల నుంచి అరుదైన పెయింటింగ్స్ వరకు ప్రతి ఒక్కటీ విలువైనదే. కానీ స్కాట్‌లాండ్‌లో ఓ మనిషి పుర్రె, ఎముకను వేలం వేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి జనాలు ఉలిక్కిపడ్డారు. అయితే, సంపన్నులు మాత్రం వాటిని దక్కించుకోడానికి ఎంత మొత్తమైనా చెల్లిస్తామని ముందుకొచ్చారు. కానీ, అప్పుడే వారికి మింగుడుపడని ఓ ప్రకటన వచ్చింది.
మానవ అవశేషాలను విక్రయించడం అనైతికమంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పుర్రె, తొడ ఎముకను విక్రయించేందుకు చట్టబద్ధంగా ఎలాంటి అడ్డంకులు లేవు. ఈ నేపథ్యంలో వేలం పాట నిర్వాహకులు వాటిని వేలం వేసే వస్తువుల జాబితాలో పెట్టారు. అయితే, అది చట్ట వ్యతిరేకం కాకపోయినా.. మానవ అవశేషాలను అమ్మకానికి పెట్టడం ‘అనైతికం’ అని కొందరు వాదించారు. మానవ అవశేషాలను వైద్య సంబంధిత వస్తువులుగా పరిగణించామని, మానవ కణజాల చట్టం లేదా ఏదైనా ఖనన చట్టాలకు లోబడి ఉండనంత వరకు వాటిని విక్రయించడం నేరం కాదని నిర్వాహకులు అన్నారు.
ఈ సందర్భంగా మే 5న మాంట్రోస్‌లోని టేలర్స్ జరిగే వేలం పాట జాబితాలో పేర్కొన్న వస్తువుల్లో వీటిని చేర్చారు. స్కాట్లాండ్‌కు చెందిన సొసైటీ ఆఫ్ యాంటిక్వేరీస్ ఆ వస్తువులను తొలగించాల్సిందిగా కోరింది. ‘వ్యక్తులను వస్తువులుగా మార్చడం తప్పు’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో అంగస్ ఆక్షన్ హౌస్‌లోని మిలిటేరియా, డొమెస్టిక్, రూరల్ బైగోన్స్ జాబితాల నుంచి వాటిని తొలగించారు.
Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు
దీనిపై సొసైటీ ఆఫ్ యాంటిక్వేరీస్ ఆఫ్ స్కాట్లాండ్‌కు చెందిన డాక్టర్ సైమన్ గిల్మర్ స్పందిస్తూ.. “హ్యూమన్ టిష్యూ యాక్ట్ లేదా సెపల్చర్ (ఖననం)కి సంబంధించిన చట్టాలకు విరుద్ధంగా ఉన్న మానవ అవశేషాలను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం స్కాట్‌లాండ్‌లో చట్టవిరుద్ధం కాదు. కానీ, అది అనైతికమని మేం భావిస్తున్నాం. జీవించే వ్యక్తులను రవాణా చేయడం చట్టవిరుద్ధం, కానీ చనిపోయినప్పుడు ఎందుకు మారుతుంది? మానవ అవశేషాలను గౌరవంగా పరిగణించాలి. వాటిని విక్రయించడం తగదు’’ అని తెలిపారు. అయినా వాళ్లు అమ్మితే అమ్మారు.. కానీ, ఆ పుర్రెను ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుంటారు చెప్పండి. కొనేవాళ్లకైనా బుర్ర ఉండాలిగా!!
Also Read: ఫోన్ మాట్లాడుతూ లోకం మరిచింది, రెప్పపాటులో ప్రమాదం - ఇదిగో వీడియో