Har Ghar Tiranga Campaign: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘హర్ ఘర్ తిరం’గా పేరుతో ఆగస్టు 13, 14వ తేదీల్లో ప్రతి ఇంటిపై జెండాను ఎగుర వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేగాక పౌరులు తమ సోషల్ మీడియా అకౌంట్ల డీపీలు, స్టేటస్‌లలో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పేర్కొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో భాగంగా.. harghartiranga.com పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్‌లో పౌరులు తమ ఫోటోలతో పేరు నమోదు చేసుకోవచ్చని కేంద్రం సూచించింది. ఇలా నమోదు చేసుకున్న వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరి మీరు కూడా ఇందులో భాగస్వాములు అవుతారా? అయితే, ఈ పోర్టల్‌లోకి ఫొటోలు ఎలా అప్‌లోడ్ చేయాలి? సర్టిఫికెట్ ఎలా పొందాలో చూడండి.


ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగాలో పాల్గొనాలి:


హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలంటే మీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగుర వేయాలి. సోషల్ మీడియాలోని అన్ని ఖాతాల్లో భారతీయ జెండాని డీపీగా, ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవాలి. ఆ ఫొటోలను హర్ ఘర్ తిరంగా పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి. ఇందుకు మీరు harghartiranga.com వెబ్ సైట్ ఓపెన్ చేస్తే UPLOAD SELFIE WITH FLAG అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అంతేగాక ఇందులో మీరు మీ జెండాను పిన్ చేసుకొనే ఆప్షన్ కూడా ఉంది. ఇప్పటికే 40 లక్షల మంది జెండాలతో ఉన్న తమ సెల్పీలను ఈ సైట్‌లోకి అప్‌లోడ్ చేశారు. 1.7 కోట్ల మంది తమ ప్రాంతాన్ని ఇండియా మ్యాప్‌లో పిన్ చేశారు. ఇందుకు మీరు Click On Pin a Flag మీద క్లిక్ చేస్తే చాలు.


ఇలా పిన్ చేయాలి:


Step 1 ప్రకారం.. మీ ఫ్లాగ్ పిన్ చేయడం కోసం Click On Pin A Flag మీద క్లిక్ చేయాలి. Step 2లో సోషల్ లాగిన్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. Step 3లో మీ లొకేషన్ యాక్సెస్ ఇవ్వాలి. చివరిగా Step 4లో ‘Pin a flag in your location’ మీద క్లిక్ చేసి మీ వివరాలిస్తే చాలు. ఇవన్నీ మీరు సక్సెస్ ఫుల్‌గా పిన్ చేసుకోగలిగితే.. సర్టిఫికెట్ కనిపిస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సేవ్ చేసుకుని తర్వాత ఎప్పుడైనా ప్రింట్ చేసుకోవచ్చు.


Also Read: ప్రాణాన్ని నిలబెట్టే ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు ప్రతి ఇంట్లో ఉండాల్సిందే, వీటితో మరిన్ని ఉపయోగాలు


Also read: ఈ దేశాలకు వీసా దొరకడం చాలా కష్టమట, ఆ దేశాలేంటో తెలిస్తే షాక్ తింటారు