ఎండలు పెరిగితే ఆ ప్రభావం చర్మంపై చాలా అధికం. ఎందుకంటే మొదట వేడిమికి ప్రభావితం అయ్యేది చర్మమే. ఎండ అధికంగా తగిలిన చోట నల్లగా ట్యాన్ పట్టేయడం, దురద పెట్టడం, మంట, కమిలినట్టు అవ్వడం జరుగుతుంది. ఎర్రటి  ఎండలో బయటికి వెళ్లొచ్చాక చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని పనులు తప్పకుండా చేయాలి. 


1. ఎండలోనుంచి బయటికి రాగానే చల్లని క్లాత్ తో చర్మాన్ని తుడుచుకోవాలి. లేదా ఐస్ ముక్కలతో మర్దనా చేసుకోవాలి. చర్మం నల్లబడడం, కమిలిపోవడం తగ్గుతుంది. కనీసం 


2. ఓట్స్ ను నానెబట్టి చల్లని పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే ఎండ వల్ల కలిగే నష్టం తగ్గుతుంది. 


3. సన్ స్క్రీన్ లోషన్లు రాసుకున్నాకే ఎండలోకి వెళ్లాలి. దీనివల్ల నల్లగా కమలడం తగ్గుతుంది. 


4. ఎండలోంచి వచ్చాక స్నానం చేయాలి. తక్కువ గాఢత ఉన్న సబ్బులనే ఉపయోగించాలి. యాంటీ బ్యాక్టిరియల్ గుణాలున్న సబ్బును వాడితే మంచిది. చర్మం దురద పెట్టడం తగ్గుతుంది.


5. బయటికి వెళ్లేటప్పుడు శరీరంమంతా కప్పేలా ఉన్న దుస్తులనే వేసుకోవాలి. పొట్టి చేతుల డ్రెస్ లు వేసుకోవడం తగ్గించాలి. 


6. చర్మం  కమిలినట్టు అయినా, ఎర్రగా మారిన కలబంద జెల్‌ను రాసుకోవాలి. అలాగే పుదీనా నూనె, కొబ్బరి నూనె రాస్తే చర్మం మంట త్వరగా తగ్గుతుంది. యాంటీ బ్యాక్టిరియల్ గుణాలున్న యాపిల్ సిడర్ వెనిగర్ రాసుకున్నా మంచిదే. 


ఫేస్ ప్యాక్ 
ఎండకు చర్మం కమిలితే ఈ ఫేస్ ప్యాక్ మీకు మేలు చేస్తుంది. 


1. ఒక గిన్నెల్లో రెండు స్పూన్ల పెరుగు వేయాలి. అందులో అరస్పూను శెనగపిండి వేయాలి. తరువాత పావు స్పూను పసుపు, ఒక స్పూను చక్కెర వేసి బాగా కలపాలి. మూడు స్పూను ఓట్స్ ను నీళ్లలో బాగా నానబెట్టి పైన  మిశ్రమానికి కలపాలి. ఆ పేస్టును ముఖానికి పట్టిస్తే ఎండ వల్ల వచ్చిన నలుపు, మంట, మచ్చలు అన్నీ పోతాయి. వేసవిలో వారానికి మూడు రోజులు ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా మేలు. 


2. ముల్తానీ మిట్టి కూడా కమిలిన చర్మాన్ని బాగు చేస్తుంది. ముల్తాన్ని మిట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. దీని చల్లదనం చర్మానికి హాయిగా అనిపిస్తుంది. మంట, దురద, మచ్చలు తగ్గుతాయి. 


Also read: ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మొటిమలు రావు, ఈ సమస్య ఎంతమందిని వేధిస్తోందో తెలుసా?


Also read: కరోనా టీకా భుజానికే ఎందుకు వేస్తారు? నరాలకు కాకుండా కండరాలకే సూది ఎందుకు గుచ్చుతారు?