బేకింగ్ చేయడం ఓ కళ. అది అందరికీ అంత తేలికగా రాదు. కేక్, మోమూస్, ఎగ్ పఫ్.. ఇలా బేకరీ ఫుడ్ ఏదైనా బేకింగ్ చేయడం కామన్. వాటిని తయారు చేసి సింపుల్ గా టైమర్ పెట్టేసి మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టేస్తారు. మరి మైక్రోవేవ్ ఓవెన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కేక్ తయారు చేయాలంటే బేకింగ్ తప్పనిసరి కదా ఓవెన్ లేకుండా బేకింగ్ చేస్తే సరిగా రాదని అనుకుంటారు. కానీ అదొక్కటే కాదు బేకింగ్ చేసుకునేందుకు వేరే ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా మైక్రోవేవ్ మాదిరిగానే బేకింగ్ చేసి మీ వంటలు అద్భుతంగా ఉండేలా చేస్తాయి.


ఐరన్ పాన్


ఈ మధ్య కాలంలో పాన్ వినియోగం ఎక్కువ అయిపోయింది. ప్రతి వంటకాన్ని పాన్ లోనే చేస్తున్నారు. వాటిలో వండటం వల్ల చాలా రుచిగా ఉంటాయని అంటారు. ఐరన్ స్కిల్లెట్స్ లో కేక్ లేదా ఇతర వంటకాలు బేకింగ్ చేసుకోవచ్చు. మైక్రోవేవ్ లేని వాళ్ళు ఈ పాన్ లో తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసే ముందు ఆ పాత్రకి కొద్దిగా వెన్న రాసుకుంటే సరిపోతుంది. ఆ పాత్రలో మిశ్రమం వేసి మూత పెట్టి ఉడికించుకోవచ్చు.


బేకింగ్ చెయ్యడానికి పాన్ మాత్రమే కాదు మీట ఉన్న కుకింగ్ పొట్ కూడా ఉపయోగించుకోవచ్చు. కేక్ లేదా బ్రెడ్ తయారు చేసుకోవడానికి మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత వెన్న రాసుకున్న ఒక చిన్న పాత్రలోకి దాన్ని మార్చుకోవాలి. ఆ పాత్రని ఈ కుకింగ్ చేసే గిన్నెలో పెట్టాలి. ఆ పాత్రకి ఒకవేళ రంధ్రం ఉంటే దాని మీద కాటన్ క్లాత్ వేసి ఆ తర్వాత మూత పెట్టాలి. 2 నిమిషాలు మీడియం మంట, తర్వాత 20-25 నిమిషాలు స్టవ్ ని చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకోవచ్చు. 30 నిమిషాల పాటు బేకింగ్ చేసిన తర్వాత ఎంతో టేస్టీ కేక్ రెడీ అయిపోతుంది.


ప్రెజర్ కుక్కర్


బేకింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎక్కువ మంది ప్రెజర్ కుక్కర్లనె వినియోగిస్తున్నారు. మైక్రోవేవ్ మాదిరిగానే కుక్కర్లో కూడా బేకింగ్ చాలా బాగుంటుంది. ప్రెజర్ కుక్కర్లో డెజర్ట్, బ్రెడ్ కూడా కాల్చుకోవచ్చు. అవి ఉడికేందుకు తీసుకునే గరిష్ట సమయం 30 నిమిషాలు మాత్రమే. కుకీలని ప్రెజర్ కుక్కర్లో వండేందుకు ఒక మేసన్ జార్ లో పించి మిశ్రమం వేసి దాని మీద ఒక మూత పెట్టాలి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకుని దానిలో నీళ్ళు పోయాలి. ఇప్పుడు మిశ్రమం వేసిన చిన్న చిన్న పాత్రలు అందులో పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలు ఎలా పెట్టుకుంటారో అదే మాదిరిగా వాటిని అమర్చాలి. 5-7 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే మీకు ఎంతో ఇష్టమైన రుచిగల నోరూరించే కుకీలు రెడీ అయిపోయినట్టే.


Also Read: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !


Also Read: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు!