Type 2 Diabetes: డయాబెటిస్ అనేది ఒకసారి వస్తే నయం కాలేని వ్యాధి. ఈ వ్యాధిని ఫుడ్‌తో కంట్రోల్ చేసుకోవాలి తప్పా.. ఇప్పటి వరకు ఎలాంటి మందులు కనుగొనలేదు. అందుకే చాలా మంది షుగర్ పేషంట్లు డైట్ ను చాలా జాగ్రత్తగా ఫాలో అవుతుంటారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే తాజాగా ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. రవిచంద్ర అనే 51 ఏళ్ల వ్యక్తి ఎలాంటి మందుల సహాయం లేకుండానే షుగర్ ను తిప్పికొట్టాడు. డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇదిగో ఇలా..


హాంకాంగ్‌లో నివసిస్తున్న రవిచంద్ర అనే భారత సంతతికి చెందిన వ్యక్తి 2015లో డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కానీ రవిచంద్రకు డయాబెటిస్‌కు మందులు వాడటం నచ్చలేదు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వ్యాయామం చేస్తూ డయాబెటిస్‌కు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. కిలోమీటర్ల దూరం పరుగెత్తడం ప్రారంభించాడు. డయాబెటిస్ ను స్లో డెత్ పాయిజన్ అంటారు. చెడు జీవనశైలితో ఈ వ్యాధి చాలామందిని బాధితులుగా మార్చడంతోపాటు బలి తీసుకుంది.


రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుదల కారణంగా.. క్రమంగా శరీరంలోని ఇతర బాగాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దానివల్ల వ్యక్తి మరణించే అవకాశం ఉంది. ఇవన్నీ విషయాలు తెలుసుకున్న రవిచంద్ర.. మంచి ఆహారంతోపాటు వ్యాయామం చేయడం మొదలు పెట్టాడు. ప్రతిరోజూ రన్నింగ్ చేసేవాడు. అతని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కేవలం మూడు నెలల్లో సాధారణ స్థితికి చేరుకున్నాయి.


రోజుకు 10 కిమీలు పరుగు:


మొదట్లో స్టామినా పెంచుకునేందుకు నడిచేవాడు. తర్వాత క్రమంగా రన్నింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా రవిచంద్ర స్టామినా పెరిగింది. ఆపకుండా 10 కిలోమీటర్లు పరుగెత్తేవాడు. హాంగ్ కాంగ్, చైనా, తైవాన్, భారతదేశంలో 12 మారథాన్‌లు, 5 హాఫ్-మారథాన్‌లు, 7-10 కిమీ రేసులు, 5 అల్ట్రా-రేసులను 29 రేసుల్లో పాల్గొన్నాడు.  ఇందులో హాంకాంగ్‌లోని 100-కిమీ ఆక్స్‌ఫామ్ ట్రైల్‌వాకర్‌ కూడా ఉంది. రన్నింగ్ ప్రారంభించిన మూడు నెలల్లో ఆయన బ్లడ్ షుర్ లెవల్స్ సాధారణ స్థాయికి చేరుకున్నాయి. 


100కి పైగా మారథాన్‌లు పూర్తి చేసిన తన స్నేహితుడు దేశికన్ భూవరాహన్ స్ఫూర్తితో తాను 2011లో తొలిసారి పరుగు ప్రారంభించానని చంద్ర చెప్పారు. కానీ చంద్ర గాయం కారణంగా కొన్ని రోజులు రన్నింగ్ మానేశాడు.  వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఆగకుండా 10 కి.మీ పరుగెత్తేవాడినని రవిచంద్ర తెలిపారు. ఆరు రోజులు ఉదయం 6 నుంచి 7.15 గంటల మధ్య ఆఫీసుకు వెళ్లే ముందు 8-9 కి.మీ రన్నింగ్ చేసేవాడు.


వీకెండ్ వచ్చిందంటే  లాంగ్ రన్ కోసం లాంటౌ ద్వీపంలోని మార్గాన్ని తన సొంత పట్టణం తుంగ్ చుంగ్‌లో డిస్నీల్యాండ్, హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తానని చెప్పాడు .కానీ రవిచంద్ర తన శరీరానికి పెద్దగా ఒత్తిడి కలిగించలేదు. ఏరోబిక్ ఫంక్షన్ అనే టెక్నాలజీని ఉపయోగించాడు. ఇందులో నిపుణుల సహాయంతో వ్యక్తి వయస్సు , ఇతర అంశాలకు అనుగుణంగా తక్కువ ఏరోబిక్ హృదయ స్పందన రేటుతో ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పటివరకు తాను 20,000 కి.మీ పరిగెత్తినట్లు పేర్కొన్నాడు. రవిచంద్రకు 29, 24 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా రవిచంద్రను చూసి ప్రేరణ పొందారు.  


రవిచంద్ర ఎలాంటి ఆహారం తీసుకుంటారు?


తాను ఆహారం విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనప్పటికీ తాజా కూరగాయలు, అప్పుడప్పుడు చికెన్, చేపలు తింటానని చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ లో దోస, ఇడ్లీ లేదా పెరగన్నం, మధ్యాహ్నం కూరగాయలతో చేసిన అన్నం, సాయంత్రం పండ్లను స్నాక్స్ గా తింటాడు. అయితే రన్నింగ్ సమయంలో అదనపు శక్తికోసం ఆపిల్ లేదా ఆరేంజ్ తింటానని  చెప్పుకొచ్చాడు. 


Also Read : ఉగాది పచ్చడిని ట్రెడీషనల్​గా ఇలాగే చేయాలి.. మామిడి కాయలను అస్సలు వేయకూడదట