How Long Does Chicken Last in the Fridge :  : నాన్​వెజ్​ తినేవారి ఇంట్లో కచ్చితంగా చికెన్​ను వినియోగం ఎక్కువగానే ఉంటుంది. పైగా ప్రోటీన్​కు చికెన్ మంచి సోర్స్. పైగా చికెన్ రుచిని ఇష్టపడేవారు కూడా చాలామంది ఉంటారు. మటన్ తినని వారు చికెన్​కు ఎక్కువ ప్రధాన్యమిస్తారు. అలా చికెన్ వినియోగం ఎక్కువగా చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో చికెన్​ను తెచ్చుకుని అవసరమైనప్పుడు వండుకుందాలే అని ఫ్రిడ్జ్​లో స్టోర్ చేస్తారు. మరికొన్ని సందర్భాల్లో వండిన చికెన్​ను నిల్వ చేస్తారు. ఇంతకీ చికెన్​ని ఫ్రిడ్జ్​లో ఉంచవచ్చా? వండి పెట్టాలా? వండకుండా పెట్టాలా? పెడితే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఫ్రిడ్జ్​లో చికెన్​ నిల్వ చేయడమనేది ఎప్పటినుంచో వస్తుంది. ఎందుకంటే దీనిలో స్టోర్ చేయడం చాలా సులభం, సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి. అయితే చికెన్​ను ఫ్రిడ్జ్​లో ఉంచవచ్చా? అది ఎంతకాలం సురక్షితంగా ఉంటుంది వంటి విషయాలు గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇప్పటికైనా తెలుసుకోండి. ఎందుకంటే చికెన్​ వల్ల ప్రోటీన్​ పొంది ఆరోగ్యంగా ఉండడం పక్కనపెడితే.. అనారోగ్యాలపాలవ్వాల్సి వస్తుందంటున్నారు.  


చికెన్ ఎంతకాలం నిల్వ ఉంటుందంటే..


యునైటెడ్ స్ట్రేట్స్ డిపార్ట్​మెంట్ ఆఫ్ అగ్రికల్చర్​ ప్రకారం.. వండని చికెన్​ను ఫ్రిడ్జ్​లో సుమారు రెండు రోజులు ఉంచవచ్చట. అదే వండిన చికెన్​ అయితే మూడు నుంచి నాలుగు రోజులు ఉంచవచ్చని తెలిపింది. 4°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో బ్యాక్టీరియా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఫ్రిజ్​లో చికెన్​ను స్టోర్ చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదల నెమ్మదిస్తుంది. చికెన్​ని గాలి చొరబడని కంటైనర్​లో ఉంచి ఫ్రిడ్జ్​లో పెడితే ఇంకా మంచిది. ఉడికించిన చికెన్​ను కూడా గాలి చేరని కంటైనర్​లో ఉంచాలి. 


వండని చికెన్​ను ఎక్కువ రోజులు నిల్వచేయాల్సి వస్తే..


మీరు వండని చికెన్​ను ఎక్కువ రోజులు నిల్వచేయాల్సి వస్తే.. దానిని మీరు ఫ్రీజర్​లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చికెన్​ను వండకుండా 9 నెలల వరకు ఫ్రీజర్​లో నిల్వచేయవచ్చట. ఉడికించిన చికెన్​ను ఫ్రీజర్​లో రెండు నుంచి ఆరు నెలలు నిల్వచేయవచ్చట. కానీ వివిధ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 


చికెన్ చెడిపోయందని ఎలా గుర్తించాలంటే..


చికెన్​ను ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్​లో ఉంచితే.. అది చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్​లోని చికెన్ చెడిపోయిందో.. మంచిగుందో తెలుసుకోవాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. రంగులో మార్పులు వస్తే అది పాడైనట్లు అర్థం. చికెన్ బూడిద, ఆకుపచ్చ రంగులోకి మారితే అది బ్యాక్టీరియా పెరుగుదలకు సంకేతం. వాసనలో మార్పు ఉంటుంది. అవన్నీ ఏముండదు అని వాటిని కడిగేసి వండుకుంటే మాత్రం అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 


చెడిపోయిన చికెన్ తింటే..


చికెన్​ స్టోర్ చేసినప్పుడు పాడైపోతే.. ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఫుడ్ బోర్న్ అనే అనారోగ్యం వస్తుంది. చికెన్​ను ఉడికించినప్పుడు బ్యాక్టీరియా పోతుంది కానీ.. చెడి పోయిన చికెన్​ను వండుకుని తినడం వల్ల ఆరోగ్యం నాశనమవుతుంది. మీరు పైన బ్యాక్టీరియాను పోగొట్టగలరు కానీ.. అది పూర్తిగా టాక్సిన్​ అని గుర్తించాలి. కొన్ని సందర్భాల్లో చలి, వికారం, వాంతులు, విరేచనాలు, మలంలో రక్తం కనిపించండం, డీహైడ్రేషన్​కు గురికావడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆహారం విషమై ప్రాణాలుకూడా కోల్పోవాల్సి వస్తుంది. 


Also Read : ఉడకబెట్టిన గుడ్లను ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు.. ఎన్నాళ్లు తాజాగా ఉంటాయి?