Pillow Cleaning Tips: మీ దిండు శుభ్రంగా కనిపిస్తున్నప్పటికీ, దాని నుంచి వింత వాసన వస్తుంటే, దానిని ప్రతిసారీ ఉతకాల్సిన అవసరం లేదు. చెమట, హెయిర్ ఆయిల్, తేమ, సరిగా గాలి రాకపోవడం వంటివి తరచుగా దుర్వాసనకు కారణమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పదే పదే దిండ్లను ఉతకలేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇంటి చిట్కాలతో వాటిని ఫ్రెష్‌గా మార్చుకోవచ్చు.
దిండ్లను ఎలా శుభ్రం చేయవచ్చు?
అన్నిటికన్నా సులభమైన పద్ధతి బేకింగ్ సోడాను ఉపయోగించడం. దిండుకు ఇరువైపులా కొద్దిగా బేకింగ్ సోడా చల్లి, సుమారు ఒక గంట పాటు అలానే వదిలేయండి. బేకింగ్ సోడా దుర్వాసనను పీల్చుకోవడానికి పనిచేస్తుంది. ఆ తర్వాత, దానిని వాక్యూమ్ క్లీనర్ లేదా పొడి గుడ్డతో పూర్తిగా శుభ్రం చేయండి. దీనివల్ల కంపు చాలా వరకు తగ్గిపోతుంది.
ఎండలో ఆరబెట్టవచ్చు
ఎండ ఉన్నట్లయితే, దిండును కొన్ని గంటలపాటు ఆరుబయట సూర్యరశ్మి తగిలేలా ఉంచండి. సూర్యరశ్మి సహజంగా బ్యాక్టీరియాను తగ్గించి, తేమను తొలగించడంలో సహాయపడుతుంది. దిండుకు రెండు వైపులా సమానంగా సూర్యరశ్మి తగిలేలా చూడండి. అంటే అప్పుడప్పుడు దాన్ని తిప్పి ఆరబెట్టండి
వైట్ వెనిగర్ మరో ప్రత్యామ్నాయం
దుర్వాసనలను తొలగించడంలో వైట్ వెనిగర్ కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక స్ప్రే బాటిల్‌లో తగినంత పరిమాణంలో వైట్ వెనిగర్, నీటిని కలపండి. ఈ ద్రావణాన్ని దిండుపై తేలికగా స్ప్రే చేయండి. దిండు మరీ ఎక్కువగా తడవకుండా జాగ్రత్త వహించండి. ఆ తర్వాత, దానిని పూర్తిగా గాలిలో ఆరబెట్టండి. వెనిగర్ ఆరిపోయిన తర్వాత మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దుర్వాసనలు పూర్తిగా తొలగిపోతుంది.
మీ దిండుపై తేలికపాటి, తాజాగా ఉండే సువాసన కావాలంటే, లావెండర్, నిమ్మ, లేదా యూకలిప్టస్ వంటి ఎసెన్షియల్ ఆయిల్‌ను నీటిలో కలిపి కొన్ని చుక్కలు చల్లుకోవచ్చు. ఇది మీ దిండును తాజాగా ఉంచుతూ, తేలికపాటి సువాసనను అందిస్తుంది.
Also Read: శరీరంలో B12 లోపం ఉందా? న్యూట్రిషనల్ ఈస్ట్‌ను కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి.. వెజిటేరియన్స్‌కి బెస్ట్
భవిష్యత్తులో దిండు దుర్వాసన రాకుండా నివారించడానికి, కొన్ని విషయాలను విధిగా పాటించాలి. దిండుపై చెమట, నూనె పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి. పడుకునే ముందు మీ ముఖాన్ని, జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైతే, పిల్లో ప్రొటెక్టర్‌ను ఉపయోగించండి. దాని కవర్‌ను వారానికి ఒకసారి ఉతకండి. అలాగే, మంచం మీద తినడం మానుకోండి. ఎందుకంటే వాటిపై పడిన మీ కంటికి కనిపించని ఆహార పదార్థాలు లాంగ్ టైంలో దుర్వాసనకు కారణమవుతాయి.
