బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ (Bollywood Actor Rajesh Sharma) ఆరోగ్యంపై గత 24 గంటలుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఫౌజీ' చిత్రీకరణ కోసం ఆయన హైదరాబాద్ సిటీ వచ్చారు. ఆ సినిమా సెట్స్‌లో ఏదో జరిగిందని సోషల్ మీడియా టాక్. వాటిని ఆయన అసిస్టెంట్ ఖండించారు. నెట్టింట ప్రచారంలో ఉన్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని అసిస్టెంట్ స్పష్టం చేశారు. మరి, రాజేష్ శర్మకు ఏం జరిగింది?

Continues below advertisement

నెట్టింట చక్కర్లు కొడుతున్న పుకారు ఏమిటి?ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రభాస్ 'ఫౌజీ' చిత్రీకరణ జరుగుతోంది. సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో రాజేష్ శర్మను ఓ విషపురుగు కుట్టిందని వార్తలు వచ్చాయి. ఆ కాటు వల్ల ఆయన శరీరంలో ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపించిందని, దాంతో అస్వస్థతకు గురయ్యారని సమాచారం ఉంది. దాంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. వాటిని రాజేష్ శర్మ అసిస్టెంట్ ఖండించారు.

Also Read: Swathi Srikanth Nagothi Wedding - దర్శకుడితో స్వాతి రెండో పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా

Continues below advertisement

డయాబెటిస్ కారణంగా ఆస్పత్రిలో రాజేష్ శర్మ...ఆస్పత్రిలో రాజేష్ శర్మ అడ్మిట్ కావడానికి కారణం డయాబెటిస్ అని ఆయన అసిస్టెంట్ తెలిపారు. ఓ వీడియో కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. 'ఫౌజీ' సెట్స్‌లో విషపురుగు  కుట్టిందన్న వార్తలు అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం రాజేష్ శర్మ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనను ఈ రోజు డిశ్చార్జ్ చేయనున్నారని సమాచారం.

Also ReadAnasuya Saree Trend - చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా??

డయాబెటిస్ (షుగర్)తో పాటు రాజేష్ శర్మకు జ్వరం, ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో కోల్‌కతాలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన రిపోర్టుల ప్రకారం... రాజేష్ శర్మ కుడి కాలికి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల బ్లడ్ క్లాట్స్ ఏర్పడే ప్రమాదం ఉందట. హిందీతో పాటు బెంగాలీ సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ 'పెద్ది'లోని పతాక సన్నివేశాల్లో కేంద్ర మంత్రిగా కనిపించారు. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన రాజేష్ శర్మ... త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు. 'ఫౌజీ' కాకుండా ప్రభాస్ చేతిలో కల్కి సీక్వెల్ కల్కి 2, సలార్ సీక్వెల్ ఉన్నాయి. బాహుబలి 3 ఉంటుందని హింట్ ఇచ్చారు రానా దగ్గుబాటి.

Also ReadRavi Mohan - అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?