తమిళ, తెలుగు ప్రేక్షకులకు జయం రవిగా సుపరిచితులైన కథానాయకుడు రవి మోహన్ (Ravi Mohan). కొంత కాలంగా సినిమా వార్తల కంటే వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచారు. భార్య ఆర్తీ రవితో విడాకుల వివాదం, సింగర్ కేనీషాతో బ్రేకప్ బాధ, పిల్లలను కలవనివ్వడం లేదని ఆవేదన... వెరసి సినిమాలు చేయనని రవి మోహన్ అనౌన్స్ చేశారు. విలేకరుల సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. తన వ్యక్తిగత జీవితంలో వివాదాలు ముగిసే వరకు నటనకు స్వస్తి పలుకుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు.

Continues below advertisement

వెనక్కి తగ్గిన రవి మోహన్... మళ్ళీ సినిమాల్లోకి!నటనకు గుడ్ బై చెబుతున్నట్టు, సినిమాల నుంచి తాను తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు రవి మోహన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. 

సినిమాలకు బ్రేక్ అని అనౌన్స్ చేసిన కొన్ని రోజులకు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లోని 'బెంజ్'లో రవి మోహన్ నటిస్తున్నట్టు స్వయంగా లోకేష్ కనగరాజ్ పేర్కొన్నారు. దాంతో రవి మోహన్ యూ టర్న్ తీసుకున్నట్టు అర్థం అయ్యింది. ఇప్పుడు ఓ అవార్డుల వేడుకలో ఆ అంశంపై స్వయంగా ఆయన మాట్లాడారు. 

Continues below advertisement

Also ReadKing 100 - 'కింగ్ 100'లో లేడీ విలన్... నాగార్జునతో 28 ఏళ్ల తర్వాత... అటువంటి రోల్‌లో సీనియర్ హీరోయిన్?

చెన్నైలో జరిగిన ఓ అవార్డుల వేడుకలో ''నేను సినిమాలను వదిలిపెట్టడం లేదు'' అని రవి మోహన్ ప్రకటించారు. అంతే కాదు... తన అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు. సినిమాలకు బ్రేక్ అంటూ ఎమోషనల్ అయిన ప్రెస్ మీట్ గురించి రవి మోహన్ మాట్లాడుతూ... ''అప్పుడు ఆ నిర్ణయం క్షణికావేశంలో తీసుకున్నా. నాకు ఈ ఏడాదితో 46 ఏళ్లు నిండుతాయి. నా జీవితంలో సగం కాలం సినిమాల్లో గడిపాను. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల అభిమానులు బాధపడటం నాకు నచ్చలేదు'' అన్నారు.

Also ReadHack For Heavy Earrings - బరువైన ఇయర్ రింగ్స్‌తో నొప్పి కలుగుతోందా? పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల చెప్పిన చిట్కా చూశారా?

చిత్రసీమలోని పలువురు ప్రముఖులు తనను కలిశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలకు దూరం కావొద్దని తనకు సలహాలు, సూచనలు ఇచ్చారని, వాళ్ళందరూ మళ్ళీ సినిమాల్లోకి రావాలని కోరడంతో తాను మనసు మార్చుకున్నట్లు రవి మోహన్ వెల్లడించారు. 'పొన్నియిన్ సెల్వన్', 'కరాటే బాబు' వంటి సినిమాల్లో పోషించిన పాత్రలతో మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తానని ఆయన చెప్పారు. తాను ఏడవడం వల్ల తన మానసిక ఆరోగ్యంపై చర్చ మొదలైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. తన రీ ఎంట్రీ సినిమా 'బెంజ్' అని స్పష్టం చేశారు. 'బెంజ్' కాకుండా రవి మోహన్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'కరాటే బాబు', 'జీనీ' చాలా రోజులుగా విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ రెండూ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. మరో సినిమా కూడా మొదలైంది.

Also ReadKangana Ranaut Queen 2 Controversy - కంగనా రనౌత్‌కు భారీ షాక్... కొత్త సినిమాపై 250 కోట్లకు కాపీరైట్ కేసు