అఖిల్ అక్కినేని 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'కింగ్ 100' అప్డేట్ గురించి అడగ్గా... జూలై 10 తర్వాత చెబుతానని అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) చెప్పారు. టాలీవుడ్ కింగ్ తన కెరీర్‌లో ఎంతో ప్రతిషాత్మకమైన 100వ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే... అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. ఆ చిత్రానికి వర్కింగ్ టైటిల్ 'కింగ్ 100' (King 100). అందులో విలన్ రోల్ గురించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అది ఏమిటంటే?

Continues below advertisement

'కింగ్ 100'లో లేడీ విలన్!Villain Role In King 100: 'కింగ్ 100'లో వెండితెరపై గతంలో హీరో హీరోయిన్లుగా సూపర్ డూపర్ హిట్ అందుకున్న మ్యాజికల్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తున్నారు. సుమారు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు కలిసి నటిస్తున్న చిత్రమిది.

Also Read: Hack For Heavy Earrings - బరువైన ఇయర్ రింగ్స్‌తో నొప్పి కలుగుతోందా? పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల చెప్పిన చిట్కా చూశారా?

Continues below advertisement

'కింగ్ 100'లో నటిస్తున్న సంగతిని టబు రివీల్ చేశారు. అయితే... లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించడం లేదు. 'కింగ్ 100'లో టబుది మెయిన్ విలన్‌ రోల్ అని టాక్. 'నిన్నే పెళ్ళాడతా', 'ఆవిడా మా ఆవిడే' వంటి హిట్ సినిమాల్లో జంటగా నటించిన వాళ్ళిద్దరూ... ఈసారి ఒకరితో మరొకరు 'ఢీ అంటే ఢీ' అంటూ పోటీ పడతారట. ఆల్రెడీ తన పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను టబు పూర్తి చేసినట్టు తెలిసింది.

Also Read: Venkatesh - అనిల్ రావిపూడి సెట్‌కు వెంకీ వచ్చాడోచ్... షూటింగ్‌లో అడుగుపెట్టిన విక్టరీ... ఇక నవ్వులే నవ్వులు

ప్రియాంకా అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ కొరియా' గుర్తు ఉందా? నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సిరీస్ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్, 'కింగ్ 100'కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని నాగార్జున చెబుతున్నారు. తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. ఇందులో నాగార్జున 25 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వ్యక్తి వరకు వివిధ దశల్లో కనిపిస్తారట. అందు కోసం డీ ఏజింగ్ టెక్నాలజీని వాడుతున్నారట.

అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న 'కింగ్ 100'లో ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్.

Also ReadChiranjeevi - యాక్షన్ మోడ్‌లో మెగాస్టార్... డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్... చిరు158 లేటెస్ట్ అప్డేట్