Chiru 158 Movie Update: మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర)ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' ఘన విజయం సాధించింది. స్వతహాగా చిరు అభిమాని అయిన బాబీ... తన ఫేవరేట్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ష్యూర్ షాట్ హిట్ తీశారు. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. చిరు, బాబీ కలయికలోని ఆ సినిమా లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి.
డూప్ లేకుండా మెగాస్టార్ రిస్కీ స్టంట్స్!చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో రెండో సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవల 'బాలన్: ది బాయ్'తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. దళపతి విజయ్ హీరోగా 'జన నాయగన్'ను ప్రొడ్యూస్ చేసింది కూడా ఆయనే. ఖర్చుకు వెనుకాకుండా భారీ ఎత్తున తెలుగులో తమ డెబ్యూ సినిమా నిర్మించాలని డిసైడ్ అయ్యారు.
Also Read: Sobhita Dhulipala Latest Photos - చేనేత చీరలో శోభిత... సంప్రదాయానికి అక్కినేని పెద్ద కోడలి ఓటు
ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో చిరు - బాబీ 2 షూటింగ్ జరుగుతోంది. ఇందులో చిరు మీద భారీ యాక్షన్ సీన్ తీస్తున్నారు. రామ్ - లక్ష్మణ మాస్టర్స్ నేతృత్వంలో కథకు కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఇందులో చిరును పవర్ ఫుల్ అండ్ డైనమిక్ అవతార్‌లో చూస్తారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఎటువంటి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ అన్నిటినీ మెగాస్టార్ స్వయంగా చేస్తున్నారని తెలిపారు.
త్వరలో టైటిల్ టీజర్ విడుదల!?Chiru Bobby 2 Title Teaser: చిరంజీవి హీరోగా రూపొందుతున్న 158వ చిత్రమిది. అందుకని, చిరు158ని వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో సినిమా టైటిల్ టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.
చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న 'ఛాంపియన్' ఫేమ్ అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కోన వెంకట్ - చక్రవర్తి రెడ్డి, అడిషనల్ స్క్రీన్ ప్లే: హరి మోహనకృష్ణ - వినీత్ పొట్లూరి, మాటలు: భాను - నందు, రచన - దర్శకత్వం: బాబీ కొల్లి.
Also Read: Express Hari - మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
