Arjun Das's Crime Comedy Thriller Con City OTT Release Date Locked : డిఫరెంట్ కంటెంట్ ఉన్న తమిళ, మలయాళ మూవీస్ ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. తాజాగా తమిళంలో రిలీజైన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ మూవీనే కాన్ సిటీ (Con City).
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG'లో తన పవర్ ఫుల్, గంభీరమైన వాయిస్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్న నటుడు అర్జున్ దాస్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ చిత్రమే 'కాన్ సిటీ'. 'కల్కి 2898AD'లో కైరా పాత్రలో అలరించిన అన్నా బెన్ హీరోయిన్. జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఐఎండీబీ (IMDb)లో 9.1 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా... ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. హరీష్ దురైరాజ్ సినిమాకు దర్శకత్వం వహించగా... యోగిబాబు, రాధా రవి, తంబి రామయ్య, వడి వుక్కరసి, వీటీవీ గణేష్, రమేష్ తిలక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సీన్ రోల్డన్ మ్యూజిక్ అందించారు.
Also Read : Romanchakam Glimpse : రోమాంచకం గ్లింప్స్ - కూల్ అండ్ క్యూట్ బీజీఎం... జూనియర్ ప్రభాస్‌కు డార్లింగ్ ప్రశంసలు
స్టోరీ ఏంటంటే?
సాధారణ ఫ్యామిలీ శరవణన్ (అర్జున్ దాస్) ఆయన భార్య (అన్నా బెన్) దివ్యాంగుడైన తమ కుమారుడితో కలిసి జీవిస్తుంటాడు. వీరితో పాటే అత్త, బావమరిది కూడా జీవిస్తుంటారు. అయితే, డబ్బు సంపాదన కోసం వీరంతా రకరకాల స్కామ్స్ చేస్తుంటారు. అనుకోకుండా శరవణన్... విలన్‌కు భారీగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయిన తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు శరవణన్ విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఒక రోజు ఫ్రస్టేషన్‌లో ఇంట్లో వస్తువులన్నింటినీ విసిరేస్తాడు.
అదే టైంలో ప్రింటర్ విసిరేస్తుండగా... పిడుగు కారణంగా దాని బటన్ ప్రెస్ అయి 500 నోట్లు వస్తుంటాయి. అలా బటన్స్ నొక్కుతూ చాలా డబ్బులు కళ్ల చూస్తాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది. దీన్ని సీక్రెట్‌గా దాచి పెట్టగా... అతని భార్య కనిపెడుతుంది. ఆమె కూడా మెషీన్ నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఫ్యామిలీ అంతా దానికి పూజలు చేస్తారు. ఓ రోజు దాని విలువ తెలియక దివ్యాంగుడైన కొడుకు డాబాపై ఆడుకుంటాడు. బటన్ ప్రెస్ అయి మొత్తం డబ్బులతో నిండిపోతుంది. ఇదే టైంలో నగరం మొత్తం ఈ మెషీన్ గురించి తెలిసి గందరగోళం నెలకొంటుంది. సరిగ్గా అప్పుడే వీరి బాబు కిడ్నాప్ అవుతాడు. వాడిని రక్షించుకోవడానికి ఫ్యామిలీ ఏం చేసింది? మెషీన్ నుంచి డబ్బులు ఎలా వచ్చాయి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
