హరి పేరు చెబితే తెలుగు బుల్లితెర వీక్షకులు గుర్తు పట్టడం కష్టం కావచ్చు. కానీ, ఎక్స్‌ప్రెస్ హరి (Express Hari) అని చెబితే ఠక్కున గుర్తు పడతారు. తెలుగు టీవీ వీక్షకులకు అతడు సుపరిచితుడు. టీవీ షోస్ 'పటాస్'తో కెరీర్‌ను ప్రారంభించిన హరి... కామెడీ స్కిట్స్, తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులతో అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు స్టార్ మా టీవీలో షోస్ చేస్తున్నారు. ఇప్పుడీ బుల్లితెర కమెడియన్ ఓ ఇంటివాడు అయ్యారు. కొత్త ఇంటిలో అడుగు పెట్టారు.

Continues below advertisement

నాలుగు పునాదులు... మూడు గదులు కాదు...కష్టానికి ఫలితం... నా జీవితానికి ఉన్న చిరునామా!''నా సొంత ఇల్లు'' అంటూ సోషల్ మీడియాలో గృహప్రవేశం చేసిన ఫోటోలను హరి షేర్ చేశారు. అంతే కాదు... ఆ ఫోటోలను ఆయన ఇచ్చిన క్యాప్షన్ నెటిజనులు ఎంతో ఆకట్టుకుంటోంది. 

''ఇది నాలుగు పునాదుల మీద కట్టిన, మూడు గదుల ఇల్లు మాత్రమే కాదు... ఒక మధ్య తరగతి వాడి ఎన్నో ఆశలతో నిండిన కల... దాచుకున్న ప్రతి రూపాయికి ,పడిన ప్రతి కష్టానికి ఫలితం... నాది అని చెప్పుకోవడానికి, వాడి (హరి) జీవితానికి ఉన్న చిరునామా... సాధించాం అనే సంతోషం , సంపాదించుకున్న గౌరవం... ఇవన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకంగా మారిందే సొంతిల్లు... అది ఇప్పుడు నా జీవితంలోకి వచ్చింది. ఈ ఇంట్లో పడిన ప్రతి అడుగు ఆశీర్వాదంగా మారింది... నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అభిమానం, ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను'' అని హరి పేర్కొన్నారు.

Continues below advertisement

Photo Gallery: Malavika Mohanan Maldives Trip - సైకిల్ తొక్కిన మాళవిక... ఐస్ క్రీమ్ కూడా!

ఫోటోలకు లైక్స్ కొట్టిన శ్రీముఖి, స్రవంతి!ఇన్‌స్టాగ్రామ్‌లో గృహ ప్రవేశం తర్వాత ఫోటోలను షేర్ చేశారు హరి. ప్రముఖ యాంకర్ శ్రీముఖి, అలాగే స్రవంతి చోకరపు, 'జబర్దస్త్' అవినాష్ తదితరులు లైక్ చేశారు.

Also ReadPeddi OTT Release Date - పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?

కామెడీ షో 'పటాస్'తో గుర్తింపు పొందిన హరి... సామాన్య స్థాయి నుంచి తన కష్టంతో, ప్రతిభతో అంచలంచెలుగా ఎదిగారు. 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'తో పాటు కొన్ని షోలలో కనిపించడమే కాదు... వాటికి స్కిట్స్ కూడా రాస్తున్నారు. ఇవాళ ఈ నటుడు కొత్త ఇంటిలో అడుగు పెట్టడం, ఈ స్థాయికి చేరుకోవడం పట్ల వీక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతడికి కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు. గతంలో అతడికి ఓసారి అషురెడ్డి బైక్ కొని ఇచ్చారు. ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

Also Read: Jyothi Poorvaj - జగతి మేడమ్ బర్త్ డే... 'కిల్లర్' టీమ్ స్పెషల్ విషెష్... జ్యోతి పూర్వజ్ కొత్త పోస్టర్ చూశారా?