Ekasekalu Mini Series OTT Release Date Locked : ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ (ETVwin) ఎక్స్‌క్లూజివ్‌గా కామెడీ కంటెంట్, యూత్ ఫుల్ మూవీస్, సిరీస్‌లు స్ట్రీమ్ చేస్తుంది. తాజాగా మరో మినీ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. యూత్‌ను అట్రాక్ట్ చేసేందుకు విన్ మినీస్ (Win Minis) పేరుతో క్రేజీ కేటగిరీ స్టార్ట్ చేసిన ఓటీటీ సంస్థ... యూత్‌కు కనెక్ట్ అయ్యేలా కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతోంది. తక్కువ నిడివితో ఇంట్రెస్టింగ్‌గా కనెక్ట్ అయ్యే స్టోరీస్‌ను స్ట్రీమ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మరో సిరీస్ రానుంది.
క్రేజీ టైటిల్
విన్ మినీస్ సిరీస్‌లో భాగంగా 'ఎకసెకలు' (Ekasekalu) సిరీస్ జులై 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'ముగ్గురి కలలు. ఒక భారీ చిత్రం. అంతులేని గందరగోళం. ఎకసెకలు అనేది తెర వెనుక జరిగే సరదా కామెడీ చిత్రం. ఇందులో జరగకూడనివి అన్నీ జరిగిపోతుంటాయి.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సిరీస్‌లో సంధ్య రాజు, రోహిణి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేం పృథ్వీరాజ్, లక్ష్మణ్, ఐశ్వర్య తదితరులు కీలకపాత్రలు పోషించారు.
సినిమా కష్టాలు, ఇండస్ట్రీలో ఇబ్బందులు బ్యాక్ డ్రాప్‌గా 'ఎకసెకలు' కామెడీ సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కృష్ణా నగర్‌లో ఎంతోమంది ఇండస్ట్రీలో రాణించాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ముగ్గురు యువకులు భారీ సినిమా తీయాలని కలలు కంటారు. ఆ సినిమా ఓకే కావడం దగ్గర నుంచి, పరిశ్రమలో ఇగోలు, మోసాలు, సవాళ్లు అన్నింటినీ కామెడీ ట్రాక్‌లో రూపొందించారు.
Also Read : Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
