Vitamin B12 Deficiency : శరీరంలో B12 లోపం ఉందా? న్యూట్రిషనల్ ఈస్ట్‌ను కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి.. వెజిటేరియన్స్‌కి బెస్ట్

విటమిన్ బి12 తగ్గితే న్యూట్రిషనల్ ఈస్ట్ తినండి
ఫోర్టిఫై చేసిన న్యూట్రిషనల్ ఈస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్‌లోనే పెద్దలకు రోజుకు అవసరమైన విటమిన్ బి12 (సుమారు 2.4 మైక్రోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ) లభించే అవకాశం ఉంటుందని తెలుసా?
ఒక టేబుల్ స్పూన్ అంటే సుమారు 5 గ్రాముల న్యూట్రిషనల్ ఈస్ట్‌లో కేవలం 20 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అయితే ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
ఒక టేబుల్ స్పూన్‌లో సుమారు 4–5 గ్రాముల ప్రోటీన్ కూడా లభిస్తుంది. కాబట్టి శాఖాహారులు, వీగన్లు దీనిని ఆహారంలో చేర్చుకోవచ్చు.
ఇందులో విటమిన్ B1, B2, B3, B6 వంటి B-కాంప్లెక్స్ విటమిన్లు ఉండి శరీరంలో శక్తి ఉత్పత్తి, నరాల ఆరోగ్యానికి తోడ్పడతాయి.
న్యూట్రిషనల్ ఈస్ట్ సహజంగా చీజ్‌ను పోలిన రుచి కలిగి ఉంటుంది. అందుకే చీజ్‌కు ప్రత్యామ్నాయంగా చాలా మంది ఉపయోగిస్తారు.
సలాడ్లు, పాస్తా, పాప్‌కార్న్, రోస్ట్ చేసిన కూరగాయలు, సూప్ వంటి వంటకాలపై చల్లుకుని తింటే రుచి పెరగడంతో పాటు పోషకాలు కూడా అందుతాయి.
విటమిన్ B12 లోపం ఉంటే కేవలం న్యూట్రిషనల్ ఈస్ట్‌పైనే ఆధారపడకుండా, వైద్యుడి సలహాతో కారణాన్ని గుర్తించి అవసరమైతే B12 సప్లిమెంట్లు లేదా చికిత్స తీసుకోవడం ముఖ్యం. అలాగే అన్ని న్యూట్రిషనల్ ఈస్ట్ ఉత్పత్తులు B12తో ఫోర్టిఫై చేయబడవు కాబట్టి కొనుగోలు చేసే ముందు లేబుల్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి.