Rishi Sunak: ఎన్నాళ్లో వేచిన రోజు రానే వచ్చింది. ఒకప్పుడు ఏ తెల్ల జాతీయుల చేతిలో మన దేశం నలిగిపోయిందో, అదే తెల్ల జాతీయుల దేశానికి ఒక భారతీయు మూలాలున్న వ్యక్తి ప్రధాని అయ్యాడు. ఆ దేశాన్ని పాలించబోతున్నాడు. రిషి సునాక్ పేరు ఇప్పుడు బ్రిటన్, భారత దేశాల్లో మారు మోగిపోతోంది. అతని ఫ్యామిలీ, అలవాట్లు గురించి గూగుల్ అధికంగా వెతుకుతున్నారు నెటిజన్లు. రిషి సునాక్ మానసికంగా చాలా శక్తివంతమైన వ్యక్తిగా చెప్పుకుంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని తట్టుకునే మానసిక నిబద్ధత, ధైర్య సాహసాలు రిషికి అదనపు ఆకర్షణ అని చెబుతారు ఆయనకు తెలిసిన వాళ్లు. ఆయన స్ట్రెస్ బస్టర్లుగా తన ఇద్దరు కూతుళ్లని చెబుతారు. 


ప్రధాన మంత్రి ఎన్నికలకు ముందు ఆయన కొన్ని ఇంటర్య్వూలలో ఈ విషయాలను పంచుకున్నారు. రాజకీయాలు నిజానికి చాలా కష్టమై ప్రయాణంగా చెప్పుకున్నారు. రాజకీయాల్లో పడి నిద్రపోవడానికి కూడా సమయం సరిపోయేది కాదని, నిద్ర కోసం ఎప్పుడు సమయం దొరుకుతుందా అని చూసేవాడినని చెప్పారు. కుటుంబంలో కలిసి ఉండేందుకు చాలా ఇష్టపడతానని చెప్పారాయన. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసికంగా చురుగ్గా ఉండొచ్చని, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అన్నారాయన. కాకపోతే తన పిల్లలు ఎక్కువ సమయంలో భార్య అక్షతతోనే ఉంటారని అన్నారు. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని వారిద్దరితో ఉంటే చాలా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుందని చెప్పారాయన.  సునాక్ కుటుంబం పంజాబ్ నుంచి ఆఫ్రికాకు, అక్కడ్నించి బ్రిటన్‌కు వలస వెళ్లింది. సునాక్ అక్కడే జన్మించారు. అతను స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదుతున్నప్పుడు అక్షతా పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారి పెళ్లి దాకా చేరింది. 2009లో వీరిద్దరి పెళ్లి జరిగింది. 


ఏ ఆహారం ఇష్టం
రిషి సునక్ ఆల్కహాల్‌కు దూరంగా ఉంటారు. కోకోకోలా అంటే మాత్రం చాలా ఇష్టం. ఈ డ్రింకును అధికంగా తాగుతూ కనిపిస్తారు. బ్రిటన్ లోనే పుట్టి పెరిగినా కూడా భారతీయ ఆహారాన్ని ఇష్టపడతారు. 






శునకంపై ప్రేమ
కొన్ని నెలల క్రితం రిషి కుటుంబం చిన్న కుక్కపిల్లని తెచ్చుకుంది. అది తనపై  చూపిస్తున్న ప్రేమ అద్భుతమని చెబుతున్నారు రిషి. దాని వయసు ఇప్పుడు ఏడాది ఉంటుందని దానితో ఆడుతుంటే ఒత్తిడి మొత్తం పోతుందని చెప్పారు. మొదట్లో తాను ఇంట్లో కుక్కను పెంచడాన్ని వ్యతిరేకించానని,కానీ ఇప్పుడు మాత్రం తన మానసిక ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపిస్తోందని అన్నారు. మానసిక ఆరోగ్య అంశాలపై వాదించే న్యాయవాది రిషి సునక్. పలుసార్లు మానసిక ఆరోగ్య రక్షణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారాయన. 


Also read: డ్రైషాంపూ వాడుతున్నారా? అది వాడడం వల్ల తీవ్రమైన అనారోగ్యసమస్యలు వచ్చే అవకాశం