Reduce Hnagover with These Tips : సంవత్సరం అయిపోయిందనే బాధతోనో.. కొత్త సంవత్సరం వచ్చేస్తుందని సంతోషంతోనో.. చాలా మంది డిసెంబర్ 31వ తేదీన మందు తీసుకుంటారు. లిమిటెడ్​గా తీసుకుంటే పర్లేదు కానీ పార్టీ జోష్​లో దానిని కాస్త ఎక్కువగా సేవించేస్తారు. దీంతో కొందరికి కొత్త సంవత్సరం హ్యాంగోవర్​తో ప్రారంభమవుతుంది. తల పట్టేయడం, కడుపులో తిరగడం వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతుంది. అయితే ఈ హ్యాంగోవర్ లక్షణాలు తగ్గించుకునేందుకు కొన్ని మెడిసన్స్, డ్రింక్స్ ఉంటాయి. కానీ కొన్ని హోమ్ రెమిడీలతో మీరు హ్యాంగోవర్​ తగ్గించుకోవచ్చు. ఇవి మీ హ్యాంగోవర్ తగ్గించడమే కాకుండా మీకు నూతన ఉత్తేజాన్ని అందిస్తాయి. ఇంతకీ ఆ హోమ్​ రెమిడీలు ఏంటో ఓ లుక్కేద్దాం. 


హైడ్రేషన్


హ్యాంగోవర్​ను తగ్గించడం కోసం మీరు ఎక్కువగా నీటిని తీసుకోవాలి. ఎందుకంటే ఆల్కహాల్ మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది తలనొప్పి, నీరసానికి దారితీస్తుంది. కాబట్టి మీరు ఉదయాన్నే నీరు లేదా కొబ్బరి నీరు వంటివాటిని తీసుకోవచ్చు. ఎలక్ట్రోలైట్​ అధికంగా ఉండే పానీయాలు తీసుకోవడం వల్ల మీ శరీరంలో డీహైడ్రేషన్ తగ్గి.. మీకు ఎనర్జీ వస్తుంది. అవసరమైన పోషకాలను పునరుద్ధరించడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా టాక్సిన్లను బయటకు పంపి హ్యాంగోవర్​ తగ్గిస్తాయి.


నిమ్మ లేదా ఆరెంజ్ జ్యూస్


మద్యపానం.. మీ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి హ్యాంగోవర్ సమయంలో మీ శరీరంలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి మీరు సిట్రస్ ఫ్రూట్స్, జ్యూస్​లు తాగవచ్చు. నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ వంటి సిట్రస్ పానీయాలు హ్యాంగోవర్​ను వేగంగా అధిగమించడంలో హెల్ప్ చేస్తాయి. వీటిలోని విటమిన్ సి శరీరానికి అదనపు ఎనర్జీని అందిస్తుంది. అంతేకాకుండా సిట్రస్ పండ్లు ఆల్కహాల్​ను వేగంగా జీర్ణం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. 


పోషకాహార ఫుడ్


పోషకాలు అధికంగా ఉండే ఫుడ్​ని తీసుకోండి. ఇవి హ్యాంగోవర్ తర్వాత మీ శరీర సమతుల్యతను పునరుద్ధరించడంలో హెల్ప్ చేస్తాయి. ఆల్కహాల్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆకుకూరలు, సిట్రస్ పండ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఫుడ్ తీసుకోవచ్చు. పొటాషియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్​ పెరుగుతాయి. కండరాల తిమ్మిరి, అలసట తగ్గుతుంది. 


హ్యాంగోవర్​ పెయిన్


హ్యాంగోవర్​లో కడుపు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి అల్లం మంచి ఓదార్పునిస్తుంది. అల్లం ముక్కలను నీటిలో మరిగించి లేదా అల్లం టీని తాగితే మీకు చాలా రిలీఫ్​గా ఉంటుంది. ఇది మీ కడుపు నొప్పిని తగ్గించడమే కాకుండా.. వికారాన్ని తగ్గిస్తుంది. లేదంటే మీరు అల్లంతో తయారు చేసిన ఫుడ్స్ తీసుకోవచ్చు. ఇది మీ హ్యాంగోవర్ తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. 


పుదీనా


పుదీనా అజీర్ణం, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం అందించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు హ్యాంగోవర్​తో ఉన్నప్పుడు ఉదయాన్నే పుదీనా టీ కూడా తాగొచ్చు. ఇది మీ కడుపు నొప్పిని, మంటను తగ్గించుకోవడానికి పుదీనా ఆకును నేరుగా తినొచ్చు. ఇది మీకు తాజా అనుభూతిని అందించి.. హ్యాంగోవర్ తగ్గించి తిరిగి శక్తిని అందిస్తుంది. 


ఇవన్నీ మీరు హ్యాంగోవర్​నుంచి బయటపడడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. కానీ మీరు కంట్రోల్​గా తాగితేనే మంచిది. హ్యాంగోవర్ సమస్య కాకపోయినా.. అధికంగా ఆల్కహాల్ సేవించడమనేది ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా ఇది మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. పార్టీ అంటే కేవలం తాగడం ఒక్కటే కాదు.. ఎంజాయ్ చేయడమని కూడా గుర్తిస్తే అసలు హ్యాంగోవర్ సమస్యనే ఉండదు. 


Also Read : ఈ సింపుల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మీ జీవితంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి