Protect Your Hair and Skin from Holi Colors : హోలీ కలర్స్​తో ఆడుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కానీ.. ఆ రంగులను వదిలించుకునేప్పుడు అసలైన కష్టం మొదలవుతుంది. ఎందుకంటే జుట్టుపై పడిన రంగులు హెయిర్​ని డ్రై చేయడంతో పాటు.. డాండ్రఫ్ వంటి సమస్యలు పెంచుతుంది. అంతేకాకుండా జుట్టును డ్యామేజ్ చేస్తుంది. అలాగే స్కిన్​పై కూడా రంగులు అలెర్జీని కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ మొండి మరకలను వదిలించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. 


హోళీ ఆడేప్పుడు ఎలా అయినా పాత దుస్తులే ధరిస్తారు. కానీ స్కిన్, జుట్టు కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలామందికి తెలీదు. అయితే హోలీ ఆడేకంటే ముందు కొన్ని జాగ్రత్తలు.. హోలీ ఆడిన తర్వాత కొన్ని టిప్స్ ఫాలో అయితే మీ జుట్టు, స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మరి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే హోలీని కలర్​ఫుల్​గా సెలబ్రేట్ చేసుకున్నా.. స్కిన్, హెయిర్​ని కాపాడుకోవచ్చో చూసేద్దాం. 


హోలీ ఆడేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Pre-Holi Preparations)


మీ జుట్టును, చర్మాన్ని హోలీ రంగులనుంచి కాపాడుకోవాలనుకుంటే.. హోలీ ఆడే కంటే ముందే మీ జుట్టుకు, చర్మానికి నూనెను అప్లై చేయండి. కొబ్బరి నూనె లేదా ఆలివ్, ఆముదం నూనెను చర్మానికి, జుట్టుకు అప్లై చేయవచ్చు. లేదంటే జుట్టుకు డీప్ కండీషనింగ్ ఇచ్చే హెయిర్ మాస్క్ వాడొచ్చు. ఇది రంగుల వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా.. హైడ్రేషన్​ని అందిస్తూ కాపాడుతుంది. చర్మానికి నూనె రాయొద్దు అనుకుంటే.. మాయిశ్చరైజర్​ని ఉపయోగించాలి. ఇది పొడిబారడాన్ని దూరం చేసి.. రంగులు చర్మాన్ని అబ్జార్వ్ చేయకుండా కాపాడుతుంది. 


హోలీ ఆడుతున్నప్పుడు తీసుకోవాల్సి జాగ్రత్తలు (Protective Measures During Holi)


చర్మాన్ని, జుట్టును కాపాడుకునేందుకు.. మీకు కంఫర్ట్​గా ఉండే పాత డ్రెస్​లు వేసుకోవాలి. అలాగే స్కార్ఫ్, సన్​గ్లాసెస్ వాడితే జుట్టుకు, స్కిన్​కు, కళ్లకు మంచిది. హెయిర్​ని కవర్​ చేయాలనుకుంటే హెడ్​బ్యాండ్ ఉపయోగించవచ్చు. ఇది కలర్స్​ని స్కాల్ప్​ వరకు చేరకుండా కాపాడుతుంది. ముఖానికి మాస్క్ పెట్టుకోవడం లేదా.. మాయిశ్చరైజర్​ని ఎక్కువగా అప్లై చేస్తే అలెర్జీలు రాకుండా ఉంటాయి. 


హోలీ తర్వాత ఫాలో అవ్వాల్సిన టిప్స్ (Post-Holi Care)


హోలీ ఆడిన తర్వాత ఎక్కువసేపు వాటిని అలాగే స్కిన్​పై, జుట్టుపై ఉంచుకోకూడదు. వీలైనంత త్వరగా స్నానం చేసేయండి. దీనివల్ల రంగులు చర్మానికి, జుట్టుకు అతుక్కోకుండా ఉంటాయి. డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మైల్డ్ షాంపూని ఉపయోగిస్తే మంచిది. ఇది జుట్టును క్లియర్ చేస్తుంది. అలాగే వేడినీళ్లతో కాకుండా చన్నీళ్లు స్నానానికి ఉపయోగిస్తే బెటర్. తలస్నానం తర్వాత జుట్టుకు కచ్చితంగా కండీషనర్​ అప్లై చేయండి. స్నానం చేసిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇది మీ స్కిన్​ని హైడ్రేటెడ్​గా ఉంచి.. ఇరిటేషన్ లేకుండా కాపాడుతుంది. 


రంగులను వదిలించుకోవడానికి సహజమైన పద్ధతులు (Natural Remedies for Color Removal)


నిమ్మరసం తేనెను సమానంగా తీసుకుని దానిని పేస్ట్​గా చేసి.. చర్మంపై మిగిలిపోయిన మొండి రంగులపై అప్లై చేయాలి. ఇది రంగులను ఈజీగా వదిలించుకోవడంలో, స్కిన్ హెల్త్​ని మెరుగు చేయడంలో హెల్ప్ చేస్తుంది. పెరుగులో పసుపు వేసి కలిపి.. దానిని చర్మానికి అప్లై చేస్తే రంగులు పోతాయి. అంతేకాకుండా స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది. చర్మం రంగు మెరుగుపడుతుంది. ఆలివ్ నూనె, కొబ్బరినూనె సమానంగా తీసుకుని.. బాగా కలిపి హెయిర్ మాస్క్​గా ఉపయోగించవచ్చు. ఇది జుట్టుకు అంటిన రంగులను వదిలించడంతో పాటు.. మంచి కండీషన్​ను అందిస్తుంది.